Aamir Khan: విడిపోయారు.. కానీ కలిసే కనిపిస్తున్నారు.. అర్థం కానీ అమీర్ ఖాన్, కిరణ్ రావు తీరు.. వీడియో వైరల్..
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్..తన రెండవ భార్య కిరణ్ రావు విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. దాదాపు 15ఏళ్ల వైవాహిక జీవితం తర్వాతా వీరు విడాకులు తీసుకున్నారు.
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్..తన రెండవ భార్య కిరణ్ రావు విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. దాదాపు 15ఏళ్ల వైవాహిక జీవితం తర్వాతా వీరు విడాకులు తీసుకున్నారు. అయితే అమీర్ దంపతుల విడాకుల విషయం ఇటీవల బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. నెటిజన్లు అమీర్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా.. పలువురు సెలబ్రెటీలు సైతం అమీర్ వైఖరిని తప్పుబట్టారు. దీంతో మేము విడిపోయినా సంతోషంగానే ఉన్నామంటూ ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు అమీర్ ఖాన్ దంపతులు. విడాకుల తర్వాత ఈ జంట ఇంకా కలిసే తిరుగుతున్నారు. ఇటీవల వీరిద్దరు కలిసి అమీర్ ప్రస్తుతం నటిస్తున్న లాల్ సింగ్ చద్దా సినిమా సెట్లో సందడి చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అయ్యాయి.
తాజాగా ఈ జంట మళ్లీ కలుసుకున్నారు. అమీర్ ప్రస్తుతం నటిస్తున్న లాల్ సింగ్ చద్దా షూటింగ్ సెట్లో అమీర్ ఖాన్.. తన కొడుకు ఆజాద్.. మాజీ భార్య కిరణ్ రావుతో కలిసి టెన్నిస్ ఆడారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ట్వీట్..
View this post on Instagram
అమీర్ ఖాన్ కిరణ్ రావును 2005లో వివాహం చేసుకున్నారు. లగాన్ సినిమా సమయంలో వీరిద్దరు పరిచయమయ్యారు. వీరికి 2011లో ఆజాద్ జన్మించాడు. కిరణ్ రావు కంటే ముందు అమీర్ రీనా దత్తాను వివాహం చేసుకున్నాడు. ఈ జంట కూడా 15 సంవత్సరాల తర్వాత విడాకులు తీసుకున్నారు. అమీర్ ప్రస్తుతం లాల్ సింగ్ చద్దా సినిమా చేస్తున్నాడు. ఇందులో కరీనా కపూర్, మోనా సింగ్, అక్కినేని నాగ చైతన్య కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సీక్రెట్ సూపర్ స్టార్ ఫేమ్ అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తున్నారు.