మీ ఫోన్ సైలెంట్లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా ? ఈ సింపుల్ ట్రిక్స్‌తో కనుక్కోవచ్చు… విజిల్ వేసి..చప్పట్లు కొట్టి..
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ లేకుండా ఏ ఒక్కరు ఉండలేని పరిస్థితి వచ్చింది. క్షణ కాలంపాటు ఫోన్ కనిపించకపోతే.. అల్లాడిపోతుంటారు. ఎక్కడైనా ఫోన్ పెట్టి మర్చిపోతే
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ లేకుండా ఏ ఒక్కరు ఉండలేని పరిస్థితి వచ్చింది. క్షణ కాలంపాటు ఫోన్ కనిపించకపోతే.. అల్లాడిపోతుంటారు. ఎక్కడైనా ఫోన్ పెట్టి మర్చిపోతే వెతకడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో అంటే మీటింగ్స్, కార్యాలయంలలో ఉన్నప్పుడు మనం ఫోన్లను సైలెంట్లో పెడుతుంటాం. ఆ తర్వాత తిరిగి నార్మల్ మోడ్ సెట్ చేయకుండా ఎక్కడో పెట్టి మర్చిపోతుంటాము. దీంతో ఫోన్ ఎక్కడైనా పోగోట్టుకున్న వెతకడం చాలా కష్టంగా మారుతుంది. అందుకే కొన్ని చిన్న చిన్న ట్రిక్స్ ఫాలో అయితే మీ ఫోన్ సైలెంట్లో ఉన్నాసరే వెంటనే కనిపెట్టెయ్యొచ్చు.. ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆండ్రాయిడ్ ఫోన్.. మీ ఫోన్ సైలెంట్లో పెట్టి ఎక్కడైనా మర్చిపోతే.. మరో ఆండ్రాయిడ్ ఫోన్ సహాయం తీసుకోవచ్చు. ఇందుకోసం ఇంటర్నెట్ కలిగి ఉండాలి. మీ ఫోన్ లేదా ల్యాప్‌టాప్ లేదా ఇతర మొబైల్‌లలో మీ జీమెయిల్ అకౌంట్‌కు లాగిన్ అవ్వాలి. ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్ ద్వారా మొబైల్‌ను సులభంగ కనిపెట్టవచ్చు. మీ ఫోన్లో ఏదైతే జీమెయిల్ అకౌంట్ లాగిన్ అయ్యారో అదే ఖాతాను ల్యాప్ ట్యాప్లోనూ లాగిన్ అవ్వాలి.
ఎలా చేయాలంటే.. 1. ముందుగా మీ ల్యాప్‌టాప్‌లో జీమెయిల్ లాగిన్ కావాలి. 2. ముందుగా గూగుల్‌లో ఆండ్రాయిడ్ డివైస్ మేనేజర్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. 3. ఆ తర్వాత మీ మొబైల్ ప్రస్తుత స్థానాన్ని సులభంగా చూడవచ్చు. 4. స్క్రీన్ పై మీకు మొబైల్ వివరాలు కనిపిస్తాయి. అంటే ఫోన్ పేరు, నెట్వర్క్, బ్యాటరీ శాతం కనిపిస్తుంది. 5. అక్కడ మీకు 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. ప్లే సౌండ్, సెక్యూర్ డివైస్, ఎరేస్ డివైస్. 6. అందులో ప్లే సౌండ్ పై క్లిక్ చేయాలి. దీంతో వెంటనే మీ ఫోన్ పెద్దగా రింగ్ టోన్ వస్తుంది. 7. అంతే దీంతో సులభంగా మీ ఫోన్ ఎక్కడ ఉందో కనిపెట్టవచ్చు.
సెక్యూర్ డివైస్ సెలక్ట్ చేస్తే.. అందులో మీరు ఒక మెసేజ్ రాయడం ద్వారా మరొక మొబైల్ నంబర్‌ను సేవ్ చేయవచ్చు. 1. దయచేసి నా మొబైల్ తిరిగి ఇవ్వండి. మీకు తగిన బహుమతి ఇస్తాము అని షేర్ చేయవచ్చు. 2. మీ ఫోన్ ఎక్కడైనా పోయిందనుకుంటే.. సౌండ్ ఆపివేసిన ఈ మెసేజ్ వారికి చూపిస్తుంది. దీంతోపాటు కాల్ సింబల్ వస్తుంది. 3. ఒకవేళ మీ ఫోన్ తీసుకున్న వ్యక్తి ఆ కాల్ సింబల్ పై క్లిక్ చేస్తే.. వెంటనే మీరు ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఫోన్ కు నోటిఫికేషన్ వస్తుంది. కానీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఫోన్ తీసుకున్న వ్యక్తి కాల్ సింబల్ పై క్లిక్ చేస్తేనే నోటిఫికేషన్ వస్తుంది.
ఆండ్రాయిడ్ ఫోన్ యాప్ ఉపగించాలి… 1. మీ ఫోన్ కచ్చితంగా ఆన్‌లో ఉండాలి. 2. గూగుల్ ఖాతాతో సైన్ ఇన్ చేయాలి. 3. మొబైల్ డేటా తప్పనిసరిగా ఆన్‌లో ఉండాలి లేదా వై-ఫైకి కనెక్ట్ అయి ఉండాలి. 4. మొబైల్ స్టెటస్ కూడా ఆన్ లో ఉండాలి. ఆండ్రాయిడ్ ఫోన్ యాప్ కోసం గూగుల్ ప్లే స్టోర్‌లో గూగుల్ ఫైండ్ మై డివైస్ అనే యాప్ అందుబాటులో ఉంటుంది. దీనిని ఇన్స్టాల్ చేయాలి.
విజిల్ ఫోన్ ఫైండర్.. మీరు విజిల్ వేసిన వెంటనే ఫోన్ రింగ్ అవుతుంది. ఆ తర్వాత మీకు ఫోన్ ఎక్కడుందో మెసేజ్ వస్తుంది. విజిల్ వేయగానే.. ఫోన్ సౌండ్ రావడమే కాకుండా.. ఫోన్ కెమరా లైట్ కూడా ఆన్ అవుతుంది. చీకటిలో ఉన్న కూడా మీ మొబైల్ ను గుర్తించవచ్చు. దీనిని కూడా గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
చప్పట్లు కొట్టి.. ఈ యాప్ ద్వారా మీ ఫోన్ సైలెంట్లో మోడ్‌లో ఉన్నా కూడా సౌండ్ వస్తుంది. దీనికి ఇంటర్నెట్ ఉండాల్సిన పనిలేదు. ఈ యాప్ మొబైల్ డేటా, వైఫై లేకుండా పనిచేస్తుంది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి దీనిని డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత దీనిని దశల వారిగి సెటప్ చేయాలి. ఆ తర్వాత మీరు చప్పట్లు కొట్టారు. చప్పట్లు కొట్టిన వెంటనే ఫోన్ రింగ్ అవుతుంది.
Also Read: DilRaju: రామ్ చరణ్.. శంకర్ సినిమా మొదలయ్యేది అప్పుడే.. మూవీ అప్డేట్స్ చెప్పిన బడా ప్రొడ్యుసర్..