AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mobile Phone Usage: మొబైల్ ఫోన్లు అతిగా వాడకండి.. ఆ రాష్ట్ర ప్రభుత్వోగులకు షరతులు

Mobile Phone Usage: ప్రభుత్వోగులు ఆఫీస్ సమయాల్లో మొబైల్ ఫోన్ల వినియోగంపై ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. పని వేళల్లో ప్రభుత్వోగులు సాధ్యమైనంత మేరకు మొబైల్ ఫోన్ల వినియోగానికి దూరంగా ఉండాలని సూచించింది.

Mobile Phone Usage: మొబైల్ ఫోన్లు అతిగా వాడకండి.. ఆ రాష్ట్ర ప్రభుత్వోగులకు షరతులు
Mobile Users
Janardhan Veluru
|

Updated on: Jul 24, 2021 | 6:06 PM

Share

ప్రభుత్వోగులు ఆఫీస్ సమయాల్లో మొబైల్ ఫోన్ల వినియోగంపై మహారాష్ట్ర ప్రభుత్వం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. పని వేళల్లో ప్రభుత్వోగులు సాధ్యమైనంత మేరకు మొబైల్ ఫోన్ల వినియోగానికి దూరంగా ఉండాలని సూచించింది. అత్యవసరమనుకుంటే ల్యాండ్ లైన్ ఫోన్లను వినియోగించాలని సూచించింది. దేశ వ్యాప్తంగా పెగాసస్ స్పై‌వేర్ దుమారం సృష్టిస్తున్న నేపథ్యంలో మహారాష్ట్ర జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. అధికారిక పనుల నిమిత్తం అత్యవసరమైతే మాత్రమే మొబైల్ ఫోన్లు వినియోగించాలని ఉద్యోగులకు సూచించింది. ప్రభుత్వోగులు విచ్ఛలవిడిగా మొబైల్ ఫోన్ల వాడటం ద్వారా ప్రభుత్వ ఇమేజ్‌ దెబ్బతినే అవకాశమున్నట్లు పేర్కొంది. అయితే ఈ అధికారిక ఉత్తర్వుల్లో ఎక్కడా నేరుగా పెగాసస్ స్పై‌వేర్ గురించి నేరుగా ప్రస్తావించలేదు.

మొబైల్ ఫోన్లు వినియోగించాల్సి వస్తే..ఎక్కువగా టెక్స్ట్ మెసేజ్‌ల ద్వారా చేసుకోవాలని ఆ ఆదేశాల్లో సూచించింది. అలాగే పనివేళల్లో మొబైల్ ఫోన్లలో సోషల్ మీడియా వినియోగాన్ని కూడా వీలైనంత తగ్గించుకోవాలని సూచించింది. ఆఫీస్ నుంచి బయటకు వచ్చాక మొబైల్ ఫోన్స్‌లో వ్యక్తిగత కాల్స్ చేసుకోవాలని..ప్రభుత్వోగుల మొబైల్ ఫోన్ వినియోగంపై ‘కోడ్ ఆఫ్ కండక్ట్’ పేరిట జారీ చేసిన ఉత్తర్వులు పేర్కొంది. పరిసర ప్రాంతాల్లో ఇతరులు ఉండే అవకాశమున్నందున మొబైల్ ఫోన్లలో గౌరవప్రదంగా మాట్లాడాలని…తక్కువ వాయిస్‌తో మొబైల్ ఫోన్లలో ఇతరులతో మాట్లాడాలని సూచించింది. అదే సమయంలో ప్రజాప్రతినిధులు, సీనియర్ అధికారుల నుంచి వచ్చే కాల్స్‌ను జాప్యం చేయకుండా తక్షణమే రిసీవ్ చేసుకోవాలని స్పష్టంచేసింది.

Mobile Apps

Mobile Phones Usage

అలాగే అధికారిక సమావేశాలు, సీనియర్ అధికారుల ఛాంబర్స్‌లో ఉండే ఛాంబర్స్‌లో మొబైల్ ఫోన్లను సైలెంట్ మోడ్‌లో ఉంచాలని ప్రభుత్యోగులకు సూచించింది. అలాగే ఇంటర్నెట్ బ్రౌసింగ్, మెసేజ్‌లను తరచూ చెక్ చేసుకోవడం, ఇయర్‌ఫోన్స్ వినియోగం చేయొద్దంటూ ప్రభుత్వోగులకు జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ పంపిన ఆదేశాల్లో స్పష్టంచేసింది.

Also Read..

మీ ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా ? ఈ సింపుల్ ట్రిక్స్‏తో కనుక్కోవచ్చు… విజిల్ వేసి..చప్పట్లు కొట్టి..

Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్.. 79 రైళ్లు రద్దు.. పూర్తి వివరాలివే..