AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

DilRaju: రామ్ చరణ్.. శంకర్ సినిమా మొదలయ్యేది అప్పుడే.. మూవీ అప్‏డేట్స్ చెప్పిన బడా ప్రొడ్యుసర్..

మెగా పవర్ స్టార్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ తర్వాత రామ్ చరణ్ పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్‏తో కలిసి

DilRaju: రామ్ చరణ్.. శంకర్ సినిమా మొదలయ్యేది అప్పుడే.. మూవీ అప్‏డేట్స్ చెప్పిన బడా ప్రొడ్యుసర్..
Ram Charan
Rajitha Chanti
|

Updated on: Jul 24, 2021 | 9:03 AM

Share

మెగా పవర్ స్టార్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ తర్వాత రామ్ చరణ్ పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్‏తో కలిసి ఓ సినిమా చేయనున్నాడు. ఈ చిత్రాన్ని బడా ప్రొడ్యుసర్ దిల్ రాజు నిర్మించనున్నాడు. ఇందుకు సంబంధించిన ఆఫీషియల్ అనౌన్స్‏మెంట్ రావడంతో చెర్రీ అభిమానులు ఎంతో సంబరపడిపోయారు. ఇక వీరిద్దరి కాంబోలో సినిమా రాబోతుందని ప్రకటన రావడంతో.. ఇండియన్ 2 మూవీ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ముందుగా ఒప్పుకున్న తమ సినిమా ఇండియన్ 2 పూర్తి చేయకుండా.. వేరే చిత్రాలను ఎలా తెరకెక్కిస్తారని కోర్టును ఆశ్రయించింది. ఈ విషయంలో తామేమి చేయలేమని.. అది మీరు మీరు సానుకూలంగా పరిష్కరించుకోవాలని కోర్టును వెల్లడించింది. దీంతో రామ్ చరణ్.. శంకర్ సినిమాపై అసలు స్టార్ట్ అవుతుందా ? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే తాజాగా నిర్మాత దిల్ రాజు రామ్ చరణ్ అభిమానులకు తీపికబురు అందించాడు.

ఇటీవల మీడియాతో మాట్లాడిన దిల్ రాజు..ప్రస్తుతం చేస్తున్న సినిమాలు.. తదుపరి ఆయన నిర్మాణంలో రాబోతున్న చిత్రాలపై క్రేజీ అప్‏డేట్స్ అందించారు. రామ్ చరణ్, శంకర్ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం కాబోతున్నట్లుగా తెలిపారు. అలాగే ప్రస్తుతం ఎఫ్ 3 మూవీ షూటింగ్ జరుగుతుందని.. అలాగే తర్వలోనే అల్లు అర్జున్ ఐకాన్ సినిమా ప్రారంభం కాబోతుందని తెలిపారు. ఇక శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న రామ్ చరణ్, శంకర్ సినిమాను అత్యంత స్పెషల్‏గా ఉండాలని భావిస్తున్నాడట దిల్ రాజు. భారీ తారాగణంతో విజువల్ వండర్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. ప్రేక్షకులకు వినూత్న అనుభూతినిచ్చేలా 3డీ ఫార్మాట్‏లో రూపొందించనున్నారట. ఇక ఈ చిత్రానికి థమన్ మ్యూజిక్ అందించనున్నారు.

Also Read: Simhachalam : ఆషాఢ పౌర్ణమివేళ భక్తులకు పరిపూర్ణ నిత్యరూపంలో దర్శనమిస్తోన్న చందనస్వామి సింహాచలం అప్పన్న

Guru Purnima 2021: గురు పూర్ణిమ శుభ ముహుర్తము.. ప్రాముఖ్యత.. ఈరోజున ఏం చేయాలంటే..