Simhachalam : ఆషాఢ పౌర్ణమివేళ భక్తులకు పరిపూర్ణ నిత్యరూపంలో దర్శనమిస్తోన్న చందనస్వామి సింహాచలం అప్పన్న

చందనం స్వామిగా పేరుగాంచిన సింహాచలం అప్పన్న స్వామి ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకుని..

Simhachalam : ఆషాఢ పౌర్ణమివేళ భక్తులకు పరిపూర్ణ నిత్యరూపంలో దర్శనమిస్తోన్న చందనస్వామి సింహాచలం అప్పన్న
Simhachalam
Follow us
Venkata Narayana

|

Updated on: Jul 24, 2021 | 8:58 AM

Simhachalam Varaha Lakshmi Narasimha Swamy : చందనం స్వామిగా పేరుగాంచిన సింహాచలం అప్పన్న స్వామి ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకుని నేటి నుండి భక్తులకు పరిపూర్ణ నిత్య రూపంలో దర్శనం ఇస్తున్నారు. ఈరోజు తెల్లవారుజామున స్వామివారికి తుది విడతగా సుమారు 120 కిలోల సుగంధభరిత చందనాన్ని స్వామివారికి అలంకరించారు. భక్తుల రద్దీ దృష్ట్యా నేడు స్వామి వారికి జరగాల్సిన ఆర్జిత సేవలను రద్దు చేశారు ఆలయ అధికారులు. సాయంత్రం ఢిల్లీ ఉత్సవం వేడుక జరగనుంది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని సింహగిరిపై ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

Simhachalam

Simhachalam

విశాఖ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోన్న సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో ఇవాళ ఆషాఢ పౌర్ణమి పురస్కరించుకుని విశేష వైదిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇవాళ వేకువజామున స్వామిని సుప్రభాత సేవతో మేల్కొలిపి ప్రాతఃకాల పూజలు నిర్వహించి అనంతరం సుగంధభరిత శ్రీచందనాన్ని అలంకరించారు. ఉదయం ఆరు గంటల నుండి స్వామి వారు పరిపూర్ణ నిత్యరూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.

ఇక, కొండపైకి వెళ్లేందుకు నడకదారులను మూసివేశారు. కేవలం వాహనాలపై వెళ్లేవారికి మాత్రమే సింహగిరిపైకి అనుమతిస్తున్నారు. తెల్లవారుజాము నుంచి కొండపైకి బస్సు సర్వీసులను నడుపుతున్నారు. శనివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఆలయ బేడా మండపంలో ఢిల్లీ ఉత్సవం వేడుక జరగనుంది. ఆషాడ పౌర్ణమి కావటం అందులోకి శనివారం కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం సింహగిరిపై ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అదనంగా మరిన్ని ప్రసాదం కౌంటర్లను ఏర్పాటు చేశారు.

Simhadri Appanna

Simhadri Appanna

ఆషాఢ పౌర్ణమికి ముందు రోజు స్వామి వారి మాస జయంతి సందర్భంగా సంప్రదాయబద్ధంగా గిరి ప్రదక్షిణ ఘనంగా జరుగుతూ వచ్చేది. కానీ కొవిడ్ నేపథ్యంలో గత రెండేళ్లుగా గిరిప్రదక్షిణను అధికారులు రద్దు చేశారు. ఢిల్లీ విజయం ఉత్సవాన్ని మాత్రం సంప్రదాయబద్ధంగా సాయంత్రం నిర్వహిస్తామన్నారు. శనివారం మధ్యాహ్నం రెండు గంటల వరకు మాత్రమే సింహగిరిపైకి భక్తులను అనుమతిస్తారు. అనంతరం కొండపై నుంచి కిందికి రావడానికి మాత్రమే అవకాశం ఉంటుంది.

Simhachalam Chandana Swami

Simhachalam Chandana Swami

Read also : Ramyakrishna : కేటీఆర్ బర్త్ డే సెలబ్రేషన్స్ పై సినీనటి రమ్యకృష్ణ అద్భుతమైన రియాక్షన్