AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ammu Abhirami: తెలుగులో అమ్ము అభిరామి హవా.. వెంకటేష్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన హీరోయిన్..

తమిళ్ సూపర్ హిట్ మూవీ అసురన్ ను తెలుగులోకి నారప్ప పేరుతో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. కోలీవుడ్‏లో స్టార్ హీరో ధనుష్ చేసిన పాత్రలో వెంకటేష్

Ammu Abhirami: తెలుగులో అమ్ము అభిరామి హవా.. వెంకటేష్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన హీరోయిన్..
Ammu Abhirami
Rajitha Chanti
|

Updated on: Jul 24, 2021 | 7:22 AM

Share

తమిళ్ సూపర్ హిట్ మూవీ అసురన్ ను తెలుగులోకి నారప్ప పేరుతో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. కోలీవుడ్‏లో స్టార్ హీరో ధనుష్ చేసిన పాత్రలో వెంకటేష్ అద్భుతంగా నటించారు. ఇందులో ప్రియమణి హీరోయిన్‏గా నటింగా.. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. సురేష్ బాబు.. కళైపులి ఎస్ థాసు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవల అమెజాన్ ప్రైమ్‏లో విడుదలైన ఈ మూవీ హిట్ టాక్ సొంతం చేసుకుంది. సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ సూపర్ హిట్‏గా నిలిచింది. అయితే ఇందులో ప్రియమణితోపాటు.. అమ్ము అభిరామి కూడా నటించారు. కన్నమ్మ పాత్ర ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్‏లో కనిపిస్తుంది అమ్ము అభిరామి. అయితే అటు తమిళ్ అసురన్ సినిమాలో కన్నమ్మ పాత్రలను అమ్ము అభిరామి పోషించింది. తెలుగులోనూ ఈ ముద్దుగుమ్మనే నటించింది.

ఇదిలా ఉంటే.. నారప్ప సినిమా ప్రమోషన్‏లో భాగంగా అమ్ము అభిరామి మాట్లాడుతూ.. వెంకటేష్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాను తెలుగు నేర్చుకోవాలని అనుకున్న సమయంలో చూసిన మొదటి తెలుగు మూవీ ఆడువారి మాటలకు అర్థాలే వేరులే. ఇందులో వెంకటేష్ గారిని చూసి షాక్ అయ్యాను.. ఆయన చాలా స్మార్ట్‏గా కనిపించారు. ఇంత స్మార్ట్‏గా ఉన్న వెంకటేష్ గారితో ఒక్క సెల్ఫీ తీసుకున్నా కూడా జీవితం ధన్యం అనుకున్నాను.. కానీ ఆయనతో జోడీగా నటించే అవకాశం దక్కించుకున్నాను. అందుకు నేను అదృష్టవంతురాలిని అంటూ చెప్పుకొచ్చింది. ఇక నారప్ప షూటింగ్ సమయంలో వెంకటేష్ గారితో షూటింగ్ అనగానే చాలా కంగారు పడ్డానని తెలిపింది. ఆ తర్వాత ఆయనే స్వయంగా వచ్చి పలకరించి ధైర్యం చెప్పారు. తెలుగు రాకపోవడం వలన కొన్ని సార్లు ఇబ్బంది అయ్యింది. అయినా కూడా నా కంగారును పోగొట్టేందుకు ఆయన చొరవ తీసుకుని సీన్ బాగా వచ్చేలా చేసారని తెలిపింది. ఇక తెలుగులో ఆఫర్లు వస్తే.. తప్పకుండా నటిస్తాను అంటూ మనసులోని మాటను బయటపెట్టింది. ఇటీవల జగపతి ప్రధాన పాత్రలో నటించిన FCUK లో కీలక పాత్రలో కనిపించింది అమ్ము అభిరామి.

Also Read: Trisha: పెళ్లి పీటలెక్కనున్న మరో హీరోయిన్ ?.. కోలీవుడ్‏లో చక్కర్లు కొడుతున్న త్రిష పెళ్లి టాపిక్..

Chiranjeevi KTR: కేటీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్‌.. ఈ రోజు ఆ పని చేయండంటూ ట్వీట్‌..