AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Brahmaji: ట్విట్టర్‌లో బ్రహ్మాజీని ఉతికి ఆరేస్తున్న రానా, నాగశౌర్య.. మాములు ఫన్ కాదు…

టాలీవుడ్ సీనియర్  నటుడు బ్రహ్మాజీ సినిమా సెట్‌లో ఉంటే ఆ సందడి వేరని.. సినీ జనం చెప్పే మాట. కేవలం మూవీ సెట్స్‌లో మాత్రమే కాదు..

Brahmaji: ట్విట్టర్‌లో బ్రహ్మాజీని ఉతికి ఆరేస్తున్న రానా, నాగశౌర్య.. మాములు ఫన్ కాదు...
Brhamaji
Ram Naramaneni
|

Updated on: Jul 24, 2021 | 5:19 PM

Share

టాలీవుడ్ సీనియర్  నటుడు బ్రహ్మాజీ సినిమా సెట్‌లో ఉంటే ఆ సందడి వేరని.. సినీ జనం చెప్పే మాట. కేవలం మూవీ సెట్స్‌లో మాత్రమే కాదు.. ఏవైనా ఆడియో ఫంక్షన్స్, టీవీ షోస్, ఇంటర్వ్యూస్‌లో పాల్గొన్నప్పుడు కూడా ఇతగాడు క్రియేజ్ చేసే ఫన్ మాములుగా ఉండదు. అందరూ హీరోలు బ్రహ్మాజీని బాగా లైక్ చేస్తారు. తాజాగా ట్విట్టర్ వేదికగా హీరోలు నాగశౌర్య, రానా బ్రహ్మాజీని ఓ ఆట ఆడేసుకుంటున్నారు.   అసలేం జరిగిందంటే.. నాగశౌర్య హీరోగా అనీష్‌ కృష్ణా దర్శకత్వంలో  ఓ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీలో నటుడు బ్రహ్మాజీ కీలకపాత్ర పోషిస్తున్నారు. తాజాగా శౌర్య-బ్రహ్మాజీలకు సంబంధించిన కొన్ని కామెడీ సీన్స్ షూట్‌ జరిగింది. షూట్‌ అనంతరం బ్రహ్మాజీ ముఖానికి నామాలు పెట్టుకుని.. అమాయకపు లుక్‌లో నాగశౌర్యతో ఫొటోకు పోజులిచ్చారు. ఈ ఫొటోని షేర్‌ చేసిన శౌర్య.. “నా తమ్ముడు బ్రహ్మాజీ కొత్తగా ఇండస్ట్రీకి వచ్చాడు. మీ అందరి సపోర్ట్‌ తనకి ఉండాలి. దయచేసి యంగ్‌ టాలెంట్‌ని ఎంకరేజ్ చేయండి” అని సరదాగా ట్వీట్‌ చేశారు. దానికి సరదాగా స్పందించిన బ్రహ్మాజీ.. థ్యాంక్యూ అన్న.. యంగ్ టాలెంట్‌ని బాగా ఎంకరేజ్ చేస్తున్నావ్ అంటూ ఫన్నీగా రిప్లై ఇచ్చాడు.

నాగశౌర్య, బ్రహ్మాజీ ట్వీట్లు…

కాగా, ఈ ట్వీట్‌పై శనివారం రానా స్పందించారు. “వామ్మో ఇదేంటి గురు!! నాగశౌర్య.. దయచేసి నువ్వు జాగ్రత్తగా ఉండు. బ్రహ్మాజీ చూపు నాకేంటో తేడాగా కనిపిస్తోంది. నువ్వు ఏమంటావ్‌?” అని రిప్లై ఇచ్చారు. దీనిపై శౌర్య స్పందిస్తూ.. “నువ్వు చెప్పింది కరెక్ట్‌ భయ్యా. నాకూ ఏదో తేడాగా అనిపిస్తోంది. జాగ్రత్తగా ఉండాల్సిందే” అని అన్నారు. ఇలా వీరి మధ్య సరదాగా సంభాషణ సాగింది.

Also Read:సరుకులు తీసేందుకు ప్రిజ్ డోర్ తీశారు.. బుసలు కొడుతూ దూసుకొచ్చిన నల్లత్రాచు

బూడిద గుమ్మడితో బోలెడన్ని ప్రయోజనాలు.. తెలిస్తే షాకవుతారు సుమీ..!

Follow Us
భారీ విస్తీర్ణంలో 219 హిమానీనదాలు.. శాస్త్రవేత్తల హెచ్చరిక
భారీ విస్తీర్ణంలో 219 హిమానీనదాలు.. శాస్త్రవేత్తల హెచ్చరిక
ఉదయాన్నే ఓ కప్పు తినండి.. శరీరాన్ని లోపలి నుంచి రిపేర్ చేస్తుంది
ఉదయాన్నే ఓ కప్పు తినండి.. శరీరాన్ని లోపలి నుంచి రిపేర్ చేస్తుంది
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!