Black Cobra: సరుకులు తీసేందుకు ప్రిజ్ డోర్ తీశారు.. బుసలు కొడుతూ దూసుకొచ్చిన నల్లత్రాచు
ఏపీలో వానలు దంచికొడుతున్నాయి. గత మూడు నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకల్లో నీళ్లు నిండుకున్నాయి. దీంతో గట్లు, పుట్టల్లో...
ఏపీలో వానలు దంచికొడుతున్నాయి. గత మూడు నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకల్లో నీళ్లు నిండుకున్నాయి. దీంతో గట్లు, పుట్టల్లో దాగివున్న క్రిమి కీటకాదులు, పాములు వంటివి జనావాసాల్లోకి వచ్చి చేరుతున్నాయి. తాజాగా తూర్పు గోదావరి జిల్లాలో భారీ త్రాచుపాము ఒకటి ఓ ఇంట్లోని ఫ్రిజ్‌లో దూరింది. ఆ ఇంటి వారిని ఉరుకులు పరుగులు తీయించింది.
వివరాల్లోకి వెళ్తే.. మామిడికుదురు మండలం పాశర్లపూడి లంకలో పాశర్లపూడి లంకలో అరుదైన ఈ 6 అడుగుల నల్ల త్రాచు హల్‌చల్ చేసింది. పితాని నాగరాజు అనే వ్యక్తి ఇంట్లో దూరిన పాము…ఇంట్లోని రిఫ్రిజిరేటర్‌లో చొరబడింది. ఇంట్లో వాళ్లు.. ఫ్రిజ్‌లో సరుకులు తీసుకునే క్రమంలో పడగవిప్పి బసలు కొట్టింది. ఆ సౌండ్లు విని.. ఒక్కసారిగా కుటుంబ సభ్యులు ఉలిక్కి పడ్డారు. ఫ్రిజ్‌లో దాకున్న పామును చూసి భయంతో ఇంటి బయటకు పరుగులు తీశారు. వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న స్నేక్ క్యాచర్ సుమారు గంట పాటు శ్రమపడి పామును బయటకు తీశారు. అనంతరం దానిని జనావాసాలకు దూరంగా నిర్మానుష్య ప్రదేశంలో వదిలి వేయడంతో కుటుంబ సభ్యులు అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
కాగా ప్రస్తుతం భారీ వర్షాల కారణంగా వరదలు పోటెత్తున్న నేపథ్యంలో అడవి జంతువులు, పాములు జానావాసాల్లోకి వచ్చే అవకాశం ఉందని.. ముఖ్యంగా నదీ తీర ప్రాంతాల్లో నివశించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Also Read: కరోనా బాధిత భర్త వీర్యం కోసం పిటిషన్ వేసిన మహిళ ఇంట విషాదం