AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Crime: రాయలసీమలో మళ్లీ నాటు బాంబుల కలకలం.. ఒకరిని అరెస్ట్‌ చేసిన పోలీసులు

Bombs in Chittoor district: ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో నాటుబాంబులు కలకలం సృష్టించాయి. ఈ సంఘటనతో వెదురుకుప్పం పోలీసు స్టేషన్‌ పరిధిలోని గ్రామాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. శనివారం వెదురుకుప్పం

AP Crime: రాయలసీమలో మళ్లీ నాటు బాంబుల కలకలం.. ఒకరిని అరెస్ట్‌ చేసిన పోలీసులు
Carrying Bombs In Chittoor
Shaik Madar Saheb
|

Updated on: Jul 24, 2021 | 2:48 PM

Share

Bombs in Chittoor district: ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో నాటుబాంబులు కలకలం సృష్టించాయి. ఈ సంఘటనతో వెదురుకుప్పం పోలీసు స్టేషన్‌ పరిధిలోని గ్రామాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. శనివారం వెదురుకుప్పం మండలం బ్రాహ్మణపల్లి పంచాయతీలోని మహేశ్వరపురం ఎస్టీ కాలనీకి చెందిన దొరస్వామి వద్ద నుంచి 20 నాటుబాంబులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. దొరస్వామి నాటు బాంబులను సంచిలో వేసుకుని తీసుకువెళుతుండగా.. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాటు బాంబుల సంఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. దీంతో మహేశ్వరపురం గ్రామంలో భయాందోళన నెలకొంది.

కాగా.. అడవి జంతువుల వేట కోసం నాటు బాంబులను ఉపయోగిస్తున్నట్లు పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ బాంబుల ఘటనలో మరో ఇద్దరు పరారైనట్లు పోలీసులు వెల్లడించారు. తిరుపతి – కొత్తపల్లిమిట్ట రహదారి గొడుగు చింత వద్ద నాటు బాంబులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.

Also Read:

CBI Raids: తుపాకీ లైసెన్స్‌ల కుంభకోణం కేసులో సీబీఐ దూకుడు.. ఐఏఎస్ అధికారితో సహా మరికొందరి ఇళ్లల్లో సోదాలు

Pubg Effect: చదువుకుంటారని స్మార్ట్ ఫోన్ ఇస్తే కొంప కొల్లేరు చేశారు.. తల్లికి తెలియకుండా..