Winter Melon: బూడిద గుమ్మడితో బోలెడన్ని ప్రయోజనాలు.. తెలిస్తే షాకవుతారు సుమీ..!

దిష్టి తగలకూడదని చాలామంది తమ ఇళ్ల గుమ్మాలకు బూడిద గుమ్మడికాయ కడతారు. సీటీలలో తక్కువ కానీ పల్లెటూర్లలో ప్రతి ఇంటి గుమ్మానికి...

Winter Melon: బూడిద గుమ్మడితో బోలెడన్ని ప్రయోజనాలు.. తెలిస్తే షాకవుతారు సుమీ..!
Ash Gourd Benefits
Follow us
Ram Naramaneni

|

Updated on: Jul 24, 2021 | 4:27 PM

దిష్టి తగలకూడదని చాలామంది తమ ఇళ్ల గుమ్మాలకు బూడిద గుమ్మడికాయ కడతారు. సీటీలలో తక్కువ కానీ పల్లెటూర్లలో ప్రతి ఇంటి గుమ్మానికి బూడిద గుమ్మడికాయలు దర్శనమిస్తాయి. చాలామందికి తెలియని విషయం ఏంటంటే… దీనితో చాలా రకాల వంటకాలు కూడా చేసుకోవచ్చు. అయితే దీన్ని తరచుగా తినే వారు మాత్రం చాలా తక్కువనే ఉంటారు. కానీ ఇలా అప్పుడప్పుడూ కాకుండా.. రోజూ బూడిద గుమ్మడిని ఆహారంలో చేర్చుకుంటే మంచి ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. నీటి శాతం అధికంగా ఉండే దీన్ని తీసుకోవడం వల్ల అధిక బరువు సమస్యకు చెక్ పెట్టవచ్చని సూచిస్తున్నారు.  జీర్ణ సంబంధిత వ్యాధులకు సైతం బూడిద గుమ్మడి మంచి మెడిసిన్‌లా పనిచేస్తుందంటున్నారు.  బూడిద గుమ్మడికాయను… ‘చైనీస్‌ వాటర్‌ మిలన్‌’, ‘వ్యాక్స్‌ గార్డ్‌’,  ‘వింటర్‌ మిలన్‌’, ‘సఫేద్‌ కద్దూ’.. వంటి పేర్లతో కూడా పిలుస్తారు. సలాడ్లు, జ్యూస్‌లు, కూరలు, సూప్‌లు, స్మూతీలు.. ఇలా ఏ విధంగానైనా బూడిద గుమ్మడిని ఆహారంలో చేర్చుకోవచ్చు. మరి ఈ కాయలో ఉండే  ఔషధ గుణాలు, పోషకాలేంటో తెలుసుకుందాం పదండి.

  • పుచ్చకాయ లాగే ఇందులో కూడా నీటి స్థాయులు అధికంగా ఉంటాయి. సుమారు 96 శాతం నీటితో నిండి ఉండే గుమ్మడి డీహైడ్రేషన్‌ సమస్యల నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. శరీరంలో ఎనర్జీ లెవర్స్ పెంచుతుంది.
  • బూడిద గుమ్మడి కాయలో పైబర్ పుష్కలంగా ఉండడం వల్ల కడుపులో మంట, ఉబ్బరం, మలబద్ధకం లాంటి జీర్ణ సంబంధిత సమస్యలు దూరమవుతాయి.
  • బూడిద గుమ్మడికాయలో క్యాలరీలు అతి తక్కువగా ఉంటాయి. 100 గ్రాముల కాయ నుంచి శరీరానికి అందేవి కేవలం 13 క్యాలరీల
  • శరీరంలోని విషతుల్యాలను బయటకు పంపించే డీటాక్సిఫై ఏజెంట్‌గా ఇది పనిచేస్తుంది.
  • కొవ్వులు, కార్బోహైడ్రేట్లు కూడా దీనిలో చాలా తక్కువ పరిమాణంలో ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఆహారం.
  • బూడిద గుమ్మడిలోని విటమిన్‌-సి, నియాసిన్‌, థయామిన్‌, రైబోఫ్లేవిన్‌.. లాంటి విటమిన్లు.. ఐరన్‌, పొటాషియం, జింక్‌, క్యాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. కంటి చూపును మెరుగుపరుస్తాయి.
  • మెదడు పనితీరును మెరుగుపరచుకోవాలంటే దీనిని తరచుగా డైట్‌లో చేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు
  • బూడిద గుమ్మడి కాయ గుండె జబ్బుల నుంచి రక్షణ కల్పిస్తుంది.
  • వీటి గింజల్లో కూడా బోలెడన్ని ఔషధ గుణాలు ఉంటాయి. అందుకే వీటిని వివిధ రకాల మెడిసిన్, చర్మ సంరక్షణ నూనెల తయారీలోనూ ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.

Also Read: సరుకులు తీసేందుకు ప్రిజ్ డోర్ తీశారు.. బుసలు కొడుతూ దూసుకొచ్చిన నల్లత్రాచు

 బిడ్డకు జలుబు మందు తెచ్చేందుకు బయటకు వెళ్లింది.. బ్రతుకే ముగిసిపోయింది