Bichagadu 2 : తొలిసారి మెగాఫోన్ పట్టనున్న విజయ్ ఆంటోని.. ఆసక్తికరంగా బిచ్చగాడు2 పోస్టర్..
బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్రవేశారు హీరో విజయ్ ఆంటోని. కొంతకాలం క్రితం తమిళ్ లో వచ్చిన పిచ్చైకరన్ సినిమాను బిచ్చగాడు..
Bichagadu 2 : బిచ్చగాడు అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్రవేశారు హీరో విజయ్ ఆంటోని. తమిళ్‌లో వచ్చిన పిచ్చైకారన్ సినిమాను బిచ్చగాడు అనే టైటిల్‌తో తెలుగులో విడుదల చేశారు. ఇంట్రస్టింగ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా అక్కడా.. ఇక్కడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలోని అమ్మ సెటిమెంట్ ప్రతిఒక్కరిని కదిలించింది. క్లాస్ మాస్ అనే తేడాలేకుండా అన్నీ వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది బిచ్చగాడు. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రూపొందిస్తోన్నారు. పిచ్చైకారన్2 అనే టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కిస్తోన్నారు. అలాగే ఈ సినిమాను తెలుగులో కూడా డబ్ చేయనున్నారు. అయితే ఈ సినిమాకు ఎవరు దర్శకత్వం వహిస్తారన్నది నిన్నటివరకు సస్పెన్స్‌గా ఉంచారు. ఎట్టకేలకు ఈ సినిమాకు దర్శకుడు ఎవరు అనేది స్టార్ డైరెక్టర్ మురగదాస్ రివీల్ చేసారు.
ఈ చిత్రాన్ని తనే నిర్మిస్తూ, తొలిసారి మెగాఫోన్ పట్టి దర్శకుడిగానూ అవతారమెత్తాడు విజయ్ ఆంటోని. హీరోగా, నిర్మాతగా, సంగీత దర్శకుడిగా, సింగర్ గా ఇలా ఇన్ని విభాగాలను మెయింటెన్ చేస్తున్న విజయ్ ఇప్పుడు దర్శకుడిగా ఎలా రాణిస్తారో చూడాలి. ఇక బిచ్చగాడు 2 సంబంధించిన ఆసక్తికరమైన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను తాజాగా విడుదల చేశారు. ఇప్పటికే తాను అడుగు పెట్టిన అన్ని చోట్ల సక్సెస్‌లను దక్కించుకున్న విజయ్ ఆంటోనీ.. దర్శకుడిగానూ సక్సెస్ అయ్యి బిచ్చగాడు 2 తో మరో సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకుంటాడా అనేది చూడాలి.
మరిన్ని ఇక్కడ చదవండి :