AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Arjun Sarja: సొంత ఖర్చులతో హనుమాన్‌ ఆలయాన్ని నిర్మించిన హీరో అర్జున్‌.. ప్రధాని మోడీకి ప్రత్యేక ఆహ్వానం

ప్రధాని నిన్నటి వరకు తమిళనాడులోనే పర్యటిస్తూ ఉన్నారు . అక్కడ ఖేలో ఇండియా గేమ్స్‌  ప్రారంభించడంతో  పాటు రామునికి సంబంధించిన పలు చారిత్రాత్మక ప్రదేశాలను సందర్శించారు. ఈ నేపథ్యంలో యాక్షన్ కింగ్‌, ప్రముఖ నటుడు అర్జున్ సర్జా పీఎం మోడీని ప్రత్యేకంగా కలిశారు

Arjun Sarja: సొంత ఖర్చులతో హనుమాన్‌ ఆలయాన్ని నిర్మించిన హీరో అర్జున్‌.. ప్రధాని మోడీకి ప్రత్యేక ఆహ్వానం
Arjun Sarja, PM Modi
Basha Shek
|

Updated on: Jan 22, 2024 | 10:55 AM

Share

అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతోంది. ప్రస్తుతం దేశ ప్రజలందరి దృష్టి ఈ చారిత్రాత్మక ఘట్టంపైనే ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరిగే ఈ మహాక్రతువును ప్రత్యక్షంగా వీక్షించేందుకు దేశ విదేశాల నుంచి మహా సాధువులు, పండితులు, సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు తరలివస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రధాని నిన్నటి వరకు తమిళనాడులోనే పర్యటిస్తూ ఉన్నారు . అక్కడ ఖేలో ఇండియా గేమ్స్‌  ప్రారంభించడంతో  పాటు రామునికి సంబంధించిన పలు చారిత్రాత్మక ప్రదేశాలను సందర్శించారు. ఈ నేపథ్యంలో యాక్షన్ కింగ్‌, ప్రముఖ నటుడు అర్జున్ సర్జా పీఎం మోడీని ప్రత్యేకంగా కలిశారు. ఈ సందర్భంగా చెన్నైలో తాను స్వయంగా నిర్మించిన హనుమాన్ ఆలయాన్ని సందర్శించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు అర్జున్‌. అలాగే తన కుమార్తె, హీరోయిన్‌ ఐశ్వర్యతో కలిసి ప్రధాని మోడీకి అంజనేయ స్వామి చిత్రపటాన్ని జ్ఞాపికగా అందజేశారు. అర్జున్‌ విజ్ఞప్తిపై ప్రధాని కూడా సానుకూలంగా స్పందించారు. త్వరలోనే హనుమాన్‌ ఆలయన్ని సందర్శిస్తానని హామీ ఇచ్చారు. ప్రస్తుతం అర్జున్‌, మోడీల భేటీకి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

అర్జున్‌ చివరిగా విజయ్‌ దళపతి లియో సినిమాలో మెరిశాడు. అందులో హరోల్డ్‌ దాస్‌గా నెగెటివ్‌ రోల్‌లో అభిమానులను మెప్పించాడు. ఇక అర్జున్‌ కూతురు ఐశ్వర్య కూడా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. పలు సినిమాల్లో నటించింది. అయితే సరైన సక్సెస్‌ ఇంకా లేదు. త్వరలోనే వైవాహిక బంధంలోకి అడుగుపెడుతోందీ అందాల తార. తమిళ స్టార్ కమెడియన్ తంబి రామయ్య కుమారుడు ఉమాపతి తో కలిసి ఏడడుగులు నడవనుంది ఐశ్వర్య. ఇటీవలే వీరి నిశ్చితార్థం వేడుక గ్రాండ్‌గా జరిగింది. ఇదిలా ఉంటే మరికాసేపట్లో అయోధ్యకు చేరుకోనున్నారు ప్రధాని మోడీ. బాలరాముడి ప్రాణప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొననున్నారు.

ఇవి కూడా చదవండి

ప్రధాని  మోడీతో అర్జున్, ఐశ్వర్య..

ప్రధాని వస్తామన్నారు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!