Tollywood: ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు.. జీవోను నిలిపేసిన న్యాయస్థానం
ఆన్‌లైన్ సినిమా టికెట్లపై ఏపీ ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది హైకోర్టు. ఈ ఇష్యు పై ఏపీ హైకోర్టులోవాదనలు జరిగాయి. ఎగ్జిబిటర్లు, బుక్‌మై షో పిటిషన్లపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం, ప్రస్తుత పరిస్థితిని కొనసాగించాలని స్పష్టం చేసింది.
ఆన్‌లైన్ సినిమా టికెట్లపై ఏపీ ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది హైకోర్టు. ఈ ఇష్యు పై ఏపీ హైకోర్టులో వాదనలు జరిగాయి. ఎగ్జిబిటర్లు, బుక్‌మై షో పిటిషన్లపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం ప్రస్తుత పరిస్థితిని కొనసాగించాలని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర, టెలివిజన్, నాటకరంగ అభివృద్ధి సంస్థకు సంబంధించిన యువర్ స్క్రీన్స్ అనే పోర్టల్ ద్వారా, సినిమా టికెట్లను ఆన్‌లైన్‌లో విక్రయించేలా ఆ సంస్థ ఏర్పాట్లు చేసింది. బ్లాక్ టికెట్ల విధానానికి స్వస్తి పలికి, తక్కువ ధరకే వినోదం అందించేందుకు ఈ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు అధికారులు. దీని ద్వారా టికెట్ బుక్ చేసుకుంటే ధరపై 1.95 శాతం మాత్రమే సేవా రుసుము ఉంటుందని వివరించారు.
ఇతర ఆన్‌లైన్ పోర్టళ్ల ద్వారా బుక్ చేసుకుంటే, ఒక్కో టికెట్‌పై ప్రేక్షకుడికి అదనంగా 20 నుంచి 25 రూపాయల వరకూ భారం పడుతోందని చెప్పారు. APSFTVTDCతో ఒప్పందం చేసుకునే థియేటర్లకు, టికెట్ల డబ్బులు ఏ రోజుకు ఆ రోజు బదలాయించేలా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఆయా థియేటర్లు ఇతర ఆన్‌లైన్ పోర్టళ్లతో కుదుర్చుకున్న ఒప్పందాలు రద్దవుతాయనే అపోహలు అక్కర్లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం ఒప్పందాల్లో ఉన్న పోర్టళ్లతో పాటు, ప్రభుత్వం తీసుకొచ్చిన యువర్ స్క్రీన్స్ ద్వారా కూడా ప్రేక్షకులు టికెట్లు బుక్ చేసుకోవొచ్చని తెలిపారు అధికారులు. ఈ నేపథ్యంలోనే ఎగ్జిబిటర్లు, బుక్‌మై షో ప్రతినిధులు హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఈ వ్యవహారం పై న్యాయస్థానం తన నిర్ణయాన్ని ప్రకటించింది. ఆన్ లైన్ సినిమా టికెట్లప్రక్రియ పై హైకోర్టు స్టే విధించింది. ప్రభుత్వం ఇచ్చిన జివో 69ని నిలిపివేస్తూ తీర్పు వెల్లడించింది. తదుపరి విచారణ ఈనెల 27కు వాయిదా వేసింది కోర్టు. ప్రధాన పిటిషన్లపై ఇంకా విచారణ పూర్తికావాల్సి ఉంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి