Pawan Kalyan: వరద బాధితులకు విరాళమిచ్చిన ఏకైక హీరోయిన్.. అనన్య నాగళ్ల గురించి పవన్ ఏమన్నారంటే?

టాలీవుడ్ నుంచి ఎన్టీఆర్, ప్రభాస్, మహేశ్ బాబు, చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, అక్కినేని నాగార్జున, వెంకటేష్, సిద్దూ జొన్నల గడ్డ తదితర ప్రముఖులు ఇరు రాష్ట్రాల్లోని వరద బాధితులకు తమ వంతు విరాళాలు ప్రకటించారు. అయితే ఈ విషయంలో స్టార్ హీరోయిన్లు చాలా వెనక బడ్డారు. టాలీవుడ్ నుంచి నటి అనన్య నాగళ్ల మాత్రమే వరద బాధితులకు అండగా నిలిచింది

Pawan Kalyan: వరద బాధితులకు విరాళమిచ్చిన ఏకైక హీరోయిన్.. అనన్య నాగళ్ల గురించి పవన్ ఏమన్నారంటే?
Ananya Nagalla, Pawan Kalyan
Follow us
Basha Shek

|

Updated on: Sep 08, 2024 | 6:45 AM

గత కొన్నిరోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలకు రెండు తెలుగు రాష్ట్రాలు అల్లాడిపోతున్నాయి. ప్రధానంగా తెలంగాణలో ఖమ్మం, ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ ప్రాంతాలు వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయాయి. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది రోడ్డున పడ్డారు. వీరిని ఆదుకునేందుకు ప్రభుత్వాలు శాయశక్తులా కృషి చేస్తున్నాయి. అలాగే వివిధ రంగాల ప్రముఖులు వరద బాధితులకు బాసటగా నిలుస్తున్నారు. టాలీవుడ్ నుంచి ఎన్టీఆర్, ప్రభాస్, మహేశ్ బాబు, చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, అక్కినేని నాగార్జున, వెంకటేష్, సిద్దూ జొన్నల గడ్డ తదితర ప్రముఖులు ఇరు రాష్ట్రాల్లోని వరద బాధితులకు తమ వంతు విరాళాలు ప్రకటించారు. అయితే ఈ విషయంలో స్టార్ హీరోయిన్లు చాలా వెనక బడ్డారు. టాలీవుడ్ నుంచి నటి అనన్య నాగళ్ల మాత్రమే వరద బాధితులకు అండగా నిలిచింది. ఏపీకి రూ.2.5 లక్షలు, తెలంగాణకు రూ.2.5 లక్షలు విరాళం ఇస్తున్నట్లు తెలిపింది. స్టార్ హీరోయిన్ హోదా లేకపోయినా, కోట్లాది రూపాయల పారితోషకాలు తీసుకోకపోయినా పెద్ద మనసుతో స్పందించిన అనన్య నాగళ్లపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.

ఇవి కూడా చదవండి

ఈక్రమంలోనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా అనన్య నాగళ్లకు కృతజ్ఞతలు తెలిపారు. ‘ఆంధ్రప్రదేశ్‌లో వరద బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 2.5 లక్షల విరాళం ప్రకటించిన వర్ధమాన నటి అనన్య నాగళ్ల కు హృదయపూర్వక ధన్యవాదాలు. కష్టకాలంలో ప్రజలకు అండగా, నిలబడి, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సహాయ కార్యక్రమాలకు మీ చేయూత బలాన్నిస్తుంది’ అని సోషల్ మీడియా వేదికగా అనన్య నాగళ్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు పవన్ కల్యాణ్‌. దీనికి అనన్య కూడా వెంటనే స్పందించింది. తన అభిమాన నటుడి నుంచి ప్రశంసలు రావడంతో ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోయింది. ‘థాంక్యూ సో మచ్ సర్ అంటూ బదులిచ్చింది. మీరు నాకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకం’ అంటూ పవన్ కు రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. మిగతా హీరోయిన్లు కూడా అనన్య నాగళ్ల మాదిరిగా వరద బాధితులను ఆదుకోవాలని అభిమానులు, నెటిజన్లు కోరుతున్నారు.

పవన్ కల్యాణ్ ట్వీట్ ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.