- Telugu News Photo Gallery Cinema photos Actress Aishwarya Lekshmi Act with Sai Durga Tej In His Next Movie SDT18
Aishwarya Lekshmi: మెగా హీరోతో మలయాళీ కుట్టి.. ఐశ్వర్య లక్ష్మికి క్రేజీ ఛాన్స్..
సౌత్ ఇండస్ట్రీలో అందం, అభినయంతో ఆకట్టుకున్న హీరోయిన్లలో ఐశ్వర్య లక్ష్మి ఒకరు. మెడిసిన్ పూర్తిచేసిన ఈ బ్యూటీ.. నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టింది. మోడలింగ్ ద్వారా సినిమా అవకాశాలు అందుకుంది ఈ అమ్మడు. 2017లో మాయానది సినిమా ద్వారా మలయాళీ చిత్రపరిశ్రమలోకి రంగ ప్రవేశం చేసింది. మొదటి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
Updated on: Sep 07, 2024 | 9:33 PM

సౌత్ ఇండస్ట్రీలో అందం, అభినయంతో ఆకట్టుకున్న హీరోయిన్లలో ఐశ్వర్య లక్ష్మి ఒకరు. మెడిసిన్ పూర్తిచేసిన ఈ బ్యూటీ.. నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టింది. మోడలింగ్ ద్వారా సినిమా అవకాశాలు అందుకుంది ఈ అమ్మడు.

2017లో మాయానది సినిమా ద్వారా మలయాళీ చిత్రపరిశ్రమలోకి రంగ ప్రవేశం చేసింది. మొదటి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత 2019లో యాక్షన్ మూవీతో కోలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.

ఆ తర్వాత విష్ణు విశాల్ తో చేసిన మట్టి కుస్తీ సినిమాతో పాపులర్ అయ్యింది. ఈ చిత్రాన్ని తెలుగులోనూ డబ్ చేశారు. అలాగే డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ మూవీలో కీలకపాత్రలో కనిపించి మెప్పించింది.

కేవలం గ్లామర్ రోల్స్ కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంటుంది. అమ్ము సినిమాతో నటిగా ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న ఐశ్వర్య లక్ష్మి తాజాగా క్రేజీ ఛాన్స్ అందుకుంది.

మెగా హీరో సాయి దుర్గా తేజ్ కెరీర్‌లో 18వ సినిమాగా రూపొందుతున్న ప్రాజెక్టులో ఐశ్వర్య నటించనుంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఈ మూవీ నుంచి ఇటీవలే ఐశ్వర్య ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.




