- Telugu News Photo Gallery Cinema photos Allu Arjun and Sharwanand other celebrities Shares Vinayaka Chavithi 2024 Photos
Vinayaka Chavithi 2024: సెలబ్రెటీస్ ఇంట్లో వినాయక చవితి .. అర్హతో అల్లు అర్జున్.. కూతురితో శర్వానంద్..
దేశవ్యాప్తంగా వినాయక చవితి పండగను ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఇక సినీ తారలు కూడా బుజ్జి గణేశుడిని పెట్టి పూజలు చేస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా తన కూతురు అర్హతో కలిసి గణనాథుడికి పూజలు చేశారు. ఇటీవలే మనమే సినిమాతో అలరించిన హీరో శర్వానంద్.. ప్రస్తుతం తన కొత్త ప్రాజెక్టు షూటింగ్ లో బిజీగా ఉన్నారు.
Updated on: Sep 07, 2024 | 9:21 PM

దేశవ్యాప్తంగా వినాయక చవితి పండగను ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఇక సినీ తారలు కూడా బుజ్జి గణేశుడిని పెట్టి పూజలు చేస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా తన కూతురు అర్హతో కలిసి గణనాథుడికి పూజలు చేశారు.

ఇటీవలే మనమే సినిమాతో అలరించిన హీరో శర్వానంద్.. ప్రస్తుతం తన కొత్త ప్రాజెక్టు షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో తన గారాలపట్టితో కలిసి గణేశుడి పూజలో కూర్చున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోను షేర్ చేశారు.

అలాగే మెగా ఇంట్లోనూ వినాయక చవితి పండగను ఘనంగా నిర్వహించుకున్నారు. మెగా హీరో వరుణ్ తేజ్ తన భార్య లావణ్య త్రిపాఠితో కలిసి గణేషుడి పూజా చేసిన ఫోటోలను పంచుకున్నారు.

అలాగే యంగ్ హీరో నాగ శౌర్య తన కుటుంబంతో కలిసి గణేశ్ చతుర్థిని ఘనంగా నిర్వహించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటస్ నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.

ఇటీవలే తండ్రిగా ప్రమోషన్ పొందారు హీరో నిఖిల్. తాజాగా తన ఇంట్లో జరిగిన వినాయక చవితి పండగ ఫోటోలనూ నెట్టింట పంచుకుంటూ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు తెలిపారు.




