AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mehreen Pirzada: ‘ఎఫ్2’కి మించిన వినోదం అందించనున్న హనీ పాప.. మెహరీన్ క్యారెక్టర్‌ను ఇలా డిజన్ చేశారట

బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి సినిమా అంటే మినిమమ్ గ్యారెంటీ ఉంటుంది. ఆయన సృష్టించే పాత్రలు వినోదానికి కేరాఫ్ అడ్రస్సులుగా అలరిస్తుంటాయి.

Mehreen Pirzada: 'ఎఫ్2'కి మించిన వినోదం అందించనున్న హనీ పాప.. మెహరీన్ క్యారెక్టర్‌ను ఇలా డిజన్ చేశారట
Mehreen Pirzada
Rajeev Rayala
|

Updated on: May 01, 2022 | 9:44 AM

Share

బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి సినిమా అంటే మినిమమ్ గ్యారెంటీ ఉంటుంది. ఆయన సృష్టించే పాత్రలు వినోదానికి కేరాఫ్ అడ్రస్సులుగా అలరిస్తుంటాయి. అలా ప్రేక్షకులకు కావాల్సిన వినోదం పంచిన పాత్రల్లో బ్లాక్ బస్టర్ హిట్ ‘ఎఫ్2’ లో మెహ్రీన్ పిర్జాదా( Mehreen Pirzada) చేసిన హానీ పాత్ర కూడా ముందు వరుసలో వుంటుంది. హనీ మేనరిజం, అమాయకత్వం, అల్లరి ప్రేక్షకుల మనసుని దోచుకున్నాయి. ఇప్పుడు ఎఫ్2 లో హనీ పాత్రకు భిన్నంగా, ఎఫ్2కి మించిన వినోదం ‘ఎఫ్3’ తో పంచబోతున్నారు మెహ్రీన్. ఈ చిత్రంలో మెహ్రీన్ పాత్రని అద్భుతంగా డిజైన్ చేశారట దర్శకుడు అనిల్ రావిపూడి. ఎఫ్3 లో మెహ్రీన్ పాత్రని మెచ్యూర్ అండ్ డిఫరెంట్ లేయర్స్ వున్న పాత్రగా పూర్తి వినోదాత్మకంగా రూపొందించారట. ఈ పాత్ర తన కెరీర్ లోనే ది బెస్ట్ ఎంటర్‌ట్రైనర్‌ రోల్ కాబోతుందని మెహ్రీన్ చెప్పుకొస్తుంది.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ప్రతిష్టాత్మక నిర్మాణంలో, బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న సూపర్ క్రేజీ ప్రాజెక్ట్ ‘F3’. ఈ మూవీలో విక్టరీ వెంకటేష్ కి జోడిగా తమన్నా భాటియా, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కి జోడిగా మెహ్రీన్ నటిస్తుండగా సోనాల్ చౌహాన్ మరో హీరోయిన్ గా అలరించబోతుంది.  ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ‘F3’ థీమ్ సాంగ్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. అలాగే సెకెండ్ సింగిల్ ‘వూ.. ఆ.. ఆహా.. ఆహా..ఆహా’ పాట అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకొని ట్రెండింగ్ లో వుంది. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే పార్టీ సాంగ్ లో సందడి చేయబోతున్నారు. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, సునీల్ తో పాటు మరికొందరు ప్రముఖ నటీనటులు ఇతర కీలక పాత్రలలో అలరించనున్నారు. ప్రేక్షకులకు నవ్వులు పంచడానికి మే 27న ఎఫ్ 3 ప్రపంచవ్యాప్తంగా భారీ విడుదలకు సిద్ధమైయింది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

HBD Ajith Kumar: ఆ స్పెషల్ ఉంగరమంటేనే ఇష్టమంటోన్న అజిత్.. మరెన్నో ఇంట్రస్టింగ్ విషయాలు మీకోసం..

Niharika: సోషల్ మీడియాలోకి రీఎంట్రీ ఇచ్చిన నిహారిక.. నేర్చుకున్న పాఠాలు ఇవేనంటూ పోస్ట్..

Sathyadev: కనిపించింది పది నిముషాలే కానీ.. చిరంజీవికే గురువు అయిపోయాడు.. మరోసారి మెగాస్టార్ సినిమాలో యంగ్ హీరో..