Niharika: సోషల్ మీడియాలోకి రీఎంట్రీ ఇచ్చిన నిహారిక.. నేర్చుకున్న పాఠాలు ఇవేనంటూ పోస్ట్..

Niharika: నిత్యం వార్తల్లో నిలిచే వారిలో మెగా డాటర్‌ నిహారిక కొణిదెల ఒకరు. వెబ్‌ సిరీస్‌లు, సినిమాలతో సందడి చేసే నిహారిక సోషల్‌ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. వివాహం తర్వాత అడపాదడపా..

Niharika: సోషల్ మీడియాలోకి రీఎంట్రీ ఇచ్చిన నిహారిక.. నేర్చుకున్న పాఠాలు ఇవేనంటూ పోస్ట్..
Niharika
Follow us
Narender Vaitla

|

Updated on: Apr 30, 2022 | 9:37 PM

Niharika: నిత్యం వార్తల్లో నిలిచే వారిలో మెగా డాటర్‌ నిహారిక కొణిదెల ఒకరు. వెబ్‌ సిరీస్‌లు, సినిమాలతో సందడి చేసే నిహారిక సోషల్‌ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. వివాహం తర్వాత అడపాదడపా స్క్రీన్‌పై కనిపిస్తోన్న నిహారిక, సోషల్‌ మీడియాలో మాత్రం నిత్యం టచ్‌లోనే ఉంటుంది. అయితే సోషల్‌ మీడియాలో నిత్యం సందడి చేసే నిహారిక ఇటీవలి కాలంలో మాత్రం పెద్దగా కనిపించడం లేదు. దాదాపు 8 వారాలుగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్క పోస్ట్ చేయలేదు. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్‌లోని పుడింగ్ అండ్ మింగ్ పబ్‌లో పోలీసులు దర్యాప్తు చేసిన సమయంలో నిహారిక ఉండడంతో ఆ అంశం రచ్చకు దారి తీసిన విషయం తెలిసిందే.

అయితే ఆ సంఘటన జరిగినప్పటి నుంచి ఇంత వరకు నిహారిక ఇటు సోషల్‌ మీడియాలో కానీ, అటు బయట కానీ ఏ కార్యక్రమంలోనూ పాల్గొనలేదు. అయితే తాజాగా నిహారిక ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఓ ఆసక్తికరమైన పోస్ట్‌ చేశారు. 8 వారాల తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన విషయాన్ని తెలుపుతూ ఓ ఫొటోను పోస్ట్‌ చేసింది. ఈ ఫొటోతోపాటు 8 వారాల ఇన్‌స్టాగ్రామ్‌ బ్రేక్‌ నుంచి తాను నేర్చుకున్న పాఠాలు ఇవేనంటూ.. ‘ఈ ప్రపంచం ఇంకా అంతం కాలేదు’, ‘ఇతరులు ఏం చేస్తున్నారన్నది నేను పట్టించుకోను’ ‘ఇప్పుడు నేను నిజంగా రీఫ్రెష్‌ అయ్యాను. పోస్టులు చేసేందుకు ఉత్సాహంగా ఉన్నాను’ అంటూ మూడు పాయింట్స్‌ రాసుకొచ్చింది.

దాదాపు రెండు నెలల గ్యాప్‌ తర్వాత నిహారిక పోస్ట్ చేయడంతో ఇది కాస్త వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే తాజాగా నిహారిక నిర్మాతగా ‘హలో వరల్డ్‌’ పేరుతో ఓ వెబ్‌ సిరీస్‌ను నిర్మిస్తోంది. దీనికి సంబంధించి ఇటీవలే పూజా కార్యక్రమాలు నిర్వహించి, షూటింగ్‌ని ప్రారంభించారు. ఈ సిరీస్‌లో సద, ఆర్యన్‌ రాజేష్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read: TOP 9 ET News: నోరు జారిన చిరు.. ఇండస్ట్రీ అంతా షాక్ | 1000కోట్లను దాటిన తగ్గని కేజీఎఫ్‌ 2 బీభత్సం..

Viral: మరీ ఇలా తయారేంట్రా బాబు.. మలద్వారంలో కూడానా..!

Virat Kohli: ఎట్టకేలకు హాఫ్‌ సెంచరీ చేసిన విరాట్‌ కోహ్లీ.. గుజరాత్‌ టైటాన్స్‌పై 58 పరుగులు చేసిన మాజీ కెప్టెన్‌..