Virat Kohli: ఎట్టకేలకు హాఫ్ సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ.. గుజరాత్ టైటాన్స్‌పై 58 పరుగులు చేసిన మాజీ కెప్టెన్..
ఐపీఎల్ 2022(IPL 2022)లో విఫలమవుతూ వస్తున్న మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చాడు. ఈ సీజన్‌లో విరాట్ కోహ్లీ తన తొలి హాఫ్ సెంచరీని నమోదు చేశాడు...
ఐపీఎల్ 2022(IPL 2022)లో విఫలమవుతూ వస్తున్న మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చాడు. ఈ సీజన్‌లో విరాట్ కోహ్లీ తన తొలి హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. అతను గుజరాత్ టైటాన్స్(GT)పై 53 బంతుల్లో 58 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో కోహ్లీకి ఇది 43వ అర్ధ సెంచరీ. ఐపీఎల్‌లో కోహ్లీ 43 హాఫ్ సెంచరీలతో పాటు 5 సెంచరీలు కూడా చేశాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ బ్యాట్‌తో రాణించడంతో స్టేడియంలో అతని పేరు మారుమోగింది. స్టేడియం మొత్తం విరాట్-విరాట్ నినాదాలు వినిపించాయి. అతను గుజరాత్ టైటాన్స్ ప్రతి బౌలర్‌ను బాగా ఆడాడు. చివరికి మహ్మద్ షమీ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ విరాట్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు.
కానీ ఖాతా తెరవకుండానే గుజరాత్ టైటాన్స్ తరఫున అరంగేట్రం బౌలర్ ప్రదీప్ సాంగ్వాన్ చేతికి చిక్కాడు. కెప్టెన్ వికెట్ పడిన తర్వాత క్రీజులోకి వచ్చిన రజత్ పాటిదార్ విరాట్ కోహ్లీతో కలిసి రెండో వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యానికి నెలకొల్పాడు. రజత్ పాటిదార్ హాఫ్ సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 6 ఫోర్లు, 1 సిక్స్ కొట్టాడు. నాయకత్వ బాధ్యతలు తన బ్యాటింగ్‌పై ప్రభావం పడుతున్నాయనే ఉద్దేశంతో కెప్టెన్‌గా అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకొన్నాడు. టీ20 లీగ్ గత సీజన్ మధ్యలోనే బెంగళూరు సారథ్యం నుంచి తప్పుకొంటున్నానని ప్రకటించాడు. దీంతో ఈసారి బ్యాటింగ్‌తో చెలరేగుతాడని అంతా భావించారు. మొదటి మ్యాచ్‌లో 41 పరుగులు చేయడంతో ఫామ్‌లోకి వచ్చాడని అభిమానులు సంతోషించారు. మరొక మ్యాచ్‌లో 48 రన్స్‌తో మెరిశాడు. అయితే ఆ తర్వాత వరుసగా ఐదు మ్యాచుల్లో రెండు డకౌట్లు కావడం తీవ్ర నిరాశపరిచింది. మళ్లీ ఫామ్‌లోకి రావడంతో కోహ్లీ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Read Also.. IPL 2022: బ్యాటర్లపై కేఎల్ రాహుల్ ఆగ్రహం.. బౌలర్ల వల్లే మ్యాచ్ గెలిచామంటూ వ్యాఖ్యలు..