IPL 2022: బ్యాటర్లపై కేఎల్‌ రాహుల్‌ ఆగ్రహం.. బౌలర్ల వల్లే మ్యాచ్‌ గెలిచామంటూ వ్యాఖ్యలు..

ఐపీఎల్ 2022(IPL 2022)లో లక్నో సూపర్ జెయింట్స్(SLG) ఆరో విజయం సాధించి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. అయినప్పటికీ ఆ జట్టు కెప్టెన్ సంతోషంగా లేడు...

IPL 2022: బ్యాటర్లపై కేఎల్‌ రాహుల్‌ ఆగ్రహం.. బౌలర్ల వల్లే మ్యాచ్‌ గెలిచామంటూ వ్యాఖ్యలు..
Kl Rahul
Follow us
Srinivas Chekkilla

| Edited By: Basha Shek

Updated on: Apr 30, 2022 | 6:05 PM

ఐపీఎల్ 2022(IPL 2022)లో లక్నో సూపర్ జెయింట్స్(SLG) ఆరో విజయం సాధించి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. అయినప్పటికీ ఆ జట్టు కెప్టెన్ సంతోషంగా లేడు. కేఎల్ రాహుల్(KL Rahul) తన జట్టు నుంచి మరింత ఆశిస్తున్నాడు. పుణె వేదికగా జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 20 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్‌(PBKS)పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో 8 వికెట్లకు 153 పరుగులు చేసింది. 154 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 133 పరుగులు మాత్రమే చేయగలిగింది. జట్టు ప్రదర్శనపై రాహుల్‌ కోపంగా ఉన్నట్లు తెలిసింది. రాహుల్ మాట్లాడుతూ.. ‘తొలి ఇన్నింగ్స్ తర్వాత నేను కోపంతో రగిలిపోయాను. మేము బంతులను వృథా చేశాం. జట్టులోని అనుభవజ్ఞులైన బ్యాట్స్‌మెన్‌ నుంచి ఇలాంటి బ్యాటింగ్‌ ఊహించలేదు. ఈ బుల్‌షిట్ క్రికెట్ షో. 160 పరుగులు చేస్తామనుకున్న. అయితే కొందరు బ్యాట్స్‌మెన్‌లు బ్యాడ్‌ షాట్‌లు ఆడుతూ మరికొందరు రనౌట్‌ కావడంతో నా ఆశను వమ్ము చేశారు.’ అని రాహుల్‌ అన్నాడు.

రాహుల్‌ బౌలర్లను మాత్రం మెచ్చుకున్నాడు. ఈ మ్యాచ్ విజయం పూర్తిగా మా బౌలర్లదే అని అన్నాడు. ఈ మ్యాచ్‌లో లక్నో రెండో వికెట్‌కు 85 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ఆ తర్వాత బ్యాటింగ్ పేకమేడలా కుప్పకూలింది. మిడిల్ ఆర్డర్‌లో వరుసగా 4 ఓవర్లలో 14 పరుగుల తేడాతో 5 వికెట్లు పడ్డాయి. లక్నో సూపర్ జెయింట్స్ ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లో ఆడిన ఎల్‌ఎస్‌జీ మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయి ఆరింటిలో గెలిచింది.

Read Also.. Rohit Sharma: రోహిత్‌ శర్మ బర్త్‌ డే స్పెషల్‌.. హిట్‌మ్యాన్‌ ఖాతాలో ఉన్న ఐదు అరుదైన రికార్డులివే..