Sathyadev: కనిపించింది పది నిముషాలే కానీ.. చిరంజీవికే గురువు అయిపోయాడు.. మరోసారి మెగాస్టార్ సినిమాలో యంగ్ హీరో..

మెగాస్టార్ చిరు  (Megastar Chiranjeevi)సినిమాలో .. అది కూడా చిరు పక్కన నటించడం ఆర్టిస్టులందరికీ ఓ కల.. ఆ కలను సాకారం చేసుకోవడం కోసమే

Sathyadev: కనిపించింది పది నిముషాలే కానీ.. చిరంజీవికే గురువు అయిపోయాడు.. మరోసారి మెగాస్టార్ సినిమాలో యంగ్ హీరో..
Sathya Dev
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 30, 2022 | 9:22 PM

మెగాస్టార్ చిరు  (Megastar Chiranjeevi)సినిమాలో .. అది కూడా చిరు పక్కన నటించడం ఆర్టిస్టులందరికీ ఓ కల.. ఆ కలను సాకారం చేసుకోవడం కోసమే ఎంతో మంది నిరీక్షణ.! చిరు పక్కన సిల్వర్ స్క్రీన్ పై ఒక్క ఫ్రేములోనైనా మెరవాలనేది చాలా మంది తపన.! అందుకోసమే ఎలాంటి క్యారెక్టరైనా చేసేందుకు రెడీ అయిపోతుంటారు .. ఆ అవకాశం కోసం డైరెక్టర్ల చుట్టూ తిరుగుతుంటారు. కానీ కొద్ది మందికి మాత్రమే ఆ అవకాశం లభిస్తుంది. యంగ్ హీరో సత్యదేవ్ ఆచార్య సినిమాతో తన కలను సాకారం చేసుకున్నాడు.. ఇక చిరు పక్కన నటించాలనే కలను చాలా తొందరగా సాకారం చేసుకున్నారు యంగ్ హీరో సత్యదేవ్‌. తన వర్సటైల్ యాక్టింగ్ స్కిల్స్‌తో ఓ వైపు హీరోగా చేస్తూనే మరో వైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగా కంటెట్‌ ఉన్న సినిమాలు చేస్తున్నారు. అందర్నీ ఆకట్టుకుంటున్నారు. అలా తాజాగా కొరటాల డైరెక్టోరియల్ ఫిల్మ్ ఆచార్యలోనూ యాక్ట్ చేశారు సత్యదేవ్‌. అది కూడా ఆశామాషీ క్యారెక్టర్లో కాదు… చిరుకు గురువుగా… చిరు దళ నాయకుడిగా కనిపించి సినిమాను టర్న్‌ చేశారు. టర్న్‌ చేయడమే కాదు సినిమాకు బ్యాక్ బోన్‌లా కూడా నిలిచాడు సత్యదేవ్‌. తన యాక్టింగ్‌తో మరోసారి సినిమాలో చేంజ్‌ ఓవర్ తీసుకొచ్చాడు. మెగా ఫ్యాన్స్ చేత శబాష్ అని అనిపించుకుంటున్నాడు

వైవిధ్యమైన సినిమాలను ఎంచుకుంటూ తెలుగు చిత్రపరిశ్రమలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు సత్యదేవ్. మిస్టర్ ఫర్ ఫెక్ట్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ యంగ్ హీరో.. ఆ తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది.. ముకుంద సినిమాల్లో కీలకపాత్రలలో నటించాడు. జ్యోతిలక్ష్మీ సినిమాలో ప్రధాన పాత్రలో నటించి మెప్పించాడు. ప్రస్తుతం గాడ్సే సినిమాలో నటిస్తున్నాడు.. ఇక ఇటీవల అచార్య సినిమాలో చిరంజీవి గురువుగా నటించి అదరగొట్టాడు. ఇప్పుడు మరోసారి చిరంజీవి పక్కన నటించనున్నట్లుగా మెగాస్టార్ ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. ఆచార్య సినిమాలో నటించడం సంతోషంగా ఉందంటూ సత్యదేవ్ ట్వీట్ చేయగా.. చిరు రీట్వీట్ చేస్తూ.. “డియర్ సత్యదేవ్.. థ్యాంక్యూ.. నీలాంటి చక్కని నటుడు నా అభిమాని కావడం చాలా సంతోషం.. ఆచార్యలో తక్కువ నిడివి పాత్రలో అయినా నువ్వు కనిపించడం నాకు ఆనందం..#Godfather సినిమాలో నా అభిమాని నాకు ఎదురు నిలబడే పూర్తి స్థాయి పాత్రలో నటించడం నాకు గర్వకారణం” అంటూ ట్వీట్ చేశాడు.. దీంతో గాడ్ ఫాదర్ సినిమాలో మరోసారి సత్యదేవ్ కీలకపాత్రలో కనిపించబోతున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తుండగా.. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కీలకపాత్రలో కనిపించనున్నాడు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: Megastar Chiranjeevi: మరోసారి టైటిల్ లీక్ చేసిన చిరు ?.. బాబీతో సినిమా అదేనంటూ..

KGF Chapter 2 Collections: కేజీఎఫ్ 2 క్రేజ్ మాములుగా లేదుగా.. మరో రికార్డ్ సృష్టించిన రాకీ భాయ్..

Radhe Shyam: మరోసారి ఓటీటీలోకి వచ్చేస్తున్న రాధేశ్యామ్.. కానీ ఈసారి అలా.

Vijay Sethupathi: ఆ స్టార్ హీరోను ఢీకొట్టేందుకు సిద్ధమైన విజయ్ సేతుపతి.. మరోసారి విలన్‏గా..