Viral Photo: అతని తీరు విభిన్నం.. స్క్రీన్‌పై కనిపిస్తే పూనకం.. ఫ్యాన్ బేస్ అనంతం.. ఎవరో గుర్తుపట్టండి..
సోషల్ మీడియా.. ఇప్పుడు ప్రత్యేకంగా ప్రపంచంగా మారిపోయింది.. ఎక్కడ ఎలాంటి విషయమైన క్షణాల్లో నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.
సోషల్ మీడియా.. ఇప్పుడు ప్రత్యేకంగా ప్రపంచంగా మారిపోయింది.. ఎక్కడ ఎలాంటి విషయమైన క్షణాల్లో నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు నెట్టింట్లో గంటలు గంటలు గడిపేస్తున్నారు. తమ అభిమాన తారలకు దగ్గరయ్యేందుకు… ఫేవరేట్ స్టార్స్ గురించి తెలుసుకునేందుకు సోషల్ మీడియా ఎక్కువగా ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు.. తమకు ఇష్టమైన వంటకాలు.. ప్రదేశాలు సినిమాలే కాకుండా.. తమ వ్యక్తిగత విషయాలు.. చిన్ననాటి ఫోటోస్.. రేర్ పిక్చర్స్ షేర్ చేస్తూ.. అభిమానులకు చేరువవుతున్నారు సినీ తారలు..ఈ క్రమంలోనే గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో సినీ తారల చిన్ననాటి ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. కాజల్, సమంత, ప్రభాస్, నాని ఇలా ప్రతి హీరోహీరోయిన్ల చైల్డ్ హుడ్ ఫోటోస్ చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ స్టార్ హీరో చిన్ననాటి ఫోటో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతుంది.
పైన ఫోటోలో చూశారు కదా.. అందమైన మోముతో.. అమయాకపు చూపులతో కనిపిస్తున్న ఈ బుడ్డొడు ఎవరో గుర్తుపట్టండి. ఈ చిన్నోడు ఇప్పుడు దక్షిణాదిలోనే స్టార్ హీరో. అతని తీరు విభిన్నం.. స్క్రీన్ పై కనిపిస్తే అభిమానులకు పూనకాలే… లవర్ బాయ్ గానే కాదు.. మాస్ యాక్షన్ హీరోగానూ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ స్టార్ హీరో సినిమా కోసం అభిమానులే కాదు. సినీ ప్రియులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఎవరో గుర్తుపట్టండి..
ఆ చిన్నోడు మరెవరో కాదండోయ్.. తమిళ్ స్టార్ హీరో అజిత్. ఫ్యాన్స్ ముద్దుగా పిలుచుకునే పేరు తలా. తెలంగాణలోని సికింద్రాబాద్ లో మే 1న 1971లో జన్మించాడు అజిత్. ప్రేమ పుస్తకం అనే సినిమాతో సినీ ప్రయాణం ఆరభించిన ఈ హీరో.. ఆశ, ప్రేమలేఖ, వాలి, అద్భుతం, విశ్వాసం, ఎంతవాడు గానీ. బిల్లా.. అంటూ దాదాపు అరవై పై చిలుకు సినిమాల్లో నటించాడు.. ఇటీవల వలిమై సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు అజిత్.. ఈ స్టార్ హీరో సైలే వేరు.. తలనెరిసినా.. జుట్టుకు రంగు.. ముఖానికి మేకప్ వేయకుండా న్యాచురల్‌గా ప్రేక్షకుల మనసులను దొచుకుంటాడు. అద్భుతం సినిమా షూటింగ్ సమయంలోనే తన తోటి నటి షాలినిని ప్రేమించి… ఏడాది తర్వాత పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం. కేవలం తమిళంలోనే కాకుండా.. తెలుగులోనూ అజిత్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే ఉంది.. రేపు అజిత్ పుట్టినరోజు.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Also Read: Megastar Chiranjeevi: మరోసారి టైటిల్ లీక్ చేసిన చిరు ?.. బాబీతో సినిమా అదేనంటూ..
KGF Chapter 2 Collections: కేజీఎఫ్ 2 క్రేజ్ మాములుగా లేదుగా.. మరో రికార్డ్ సృష్టించిన రాకీ భాయ్..
Radhe Shyam: మరోసారి ఓటీటీలోకి వచ్చేస్తున్న రాధేశ్యామ్.. కానీ ఈసారి అలా.
Vijay Sethupathi: ఆ స్టార్ హీరోను ఢీకొట్టేందుకు సిద్ధమైన విజయ్ సేతుపతి.. మరోసారి విలన్‌గా..