Vijay Sethupathi: ఆ స్టార్ హీరోను ఢీకొట్టేందుకు సిద్ధమైన విజయ్ సేతుపతి.. మరోసారి విలన్‏గా..

తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతికి (Vijay Sethupathi) తెలుగులోనూ ఫుల్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ బుచ్చిబాబు

Vijay Sethupathi: ఆ స్టార్ హీరోను ఢీకొట్టేందుకు సిద్ధమైన విజయ్ సేతుపతి.. మరోసారి విలన్‏గా..
Vijay Sethupathi
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 30, 2022 | 2:35 PM

తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతికి (Vijay Sethupathi) తెలుగులోనూ ఫుల్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ బుచ్చిబాబు సన.. మెగా యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ కాంబోలో వచ్చిన ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు విజయ్. ఇందులో ప్రతి నాయకుడు రాయనం పాత్రలో అదరగొట్టాడు. ఈ సినిమాలో విజయ్ పండించిన విలనిజంకు తెలుగు ప్రేక్షకులే కాదు.. సినీ విశ్లేషకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. ఓవైపు హీరోగా రాణిస్తూనే పాత్ర ప్రాధాన్యతను బట్టి విలన్ రోల్స్ చేసేందుకు సైతం ముందుకొస్తున్నాడు. కేవలం ఉప్పెన మాత్రమే కాకుండా.. తమిళ్ స్టార్ హీరో విజయ్ తలపతి నటించిన మాస్టర్ సినిమాలో ప్రతినాయకుడిగా మెప్పించాడు విజయ్ సేతుపతి.. ఇక ఇప్పుడు విజయ్ సేతుపతి మరోసారి విలన్ పాత్రలో నటించేందుకు సిద్ధమైనట్లు కోలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.

తమిళ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ప్రస్తుతం కాతు వాకుల రెండు కాదల్ విజయాన్ని ఆస్వాదిస్తున్నాడు. లేడీ సూపర్ స్టార్స్ నయనతార, సమంత. హీరో విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తెరకెక్కించిన ఈ మూవీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ మూవీ తర్వాత విఘ్నేష్.. స్టార్ హీరో అజిత్‏తో ఓ మూవీ చేయబోతున్నట్లు గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించనున్నాడు. అయితే ఈ మూవీలో అజిత్ ప్రతినాయకుడిగా విజయ్ సేతుపతి నటించడానికి మేకర్స్ అతడిని సంప్రదించారట. పాత్ర నచ్చడంతో విజయ్ వెంటనే ఒప్పుకున్నారట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా ఇవ్వనున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: AnushkaShetty : అప్పుడు కత్తిపట్టిన అనుష్క ఇప్పుడు గరిట తిప్పుతోంది.. ఎందుకో తెలుసా..

Nandita Swetha: గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన అందాల నందిత శ్వేత

Kangana Ranaut : ‘థాకడ్’ మూవీతో నేనేంటో చూపిస్తానంటున్న ఫైర్‌బ్రాండ్‌ కంగనా

Acharya Movie: మెగాస్టార్‌ సినిమాలో నటించి మెప్పించిన ఈ చైల్డ్‌ ఆర్టిస్ట్‌ ఎవరో తెలుసా?