AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AnushkaShetty : అప్పుడు కత్తిపట్టిన అనుష్క ఇప్పుడు గరిట తిప్పుతోంది.. ఎందుకో తెలుసా..

అందాల భామ అనుష్క సినిమాలు వచ్చి చాలా కాలం అయ్యింది. అనుష్క దాదాపు తెలుగులో ఉన్న స్టార్ హీరోలందరి సరసన నటించింది.

AnushkaShetty : అప్పుడు కత్తిపట్టిన అనుష్క ఇప్పుడు గరిట తిప్పుతోంది.. ఎందుకో తెలుసా..
Anushka
Rajeev Rayala
|

Updated on: Apr 30, 2022 | 12:44 PM

Share

అందాల భామ అనుష్క(AnushkaShetty ) సినిమాలు వచ్చి చాలా కాలం అయ్యింది. అనుష్క దాదాపు తెలుగులో ఉన్న స్టార్ హీరోలందరి సరసన నటించింది. అలాగే తమిళ్ లోనూ అనుష్క సినిమాలు చేసి సక్సెస్ అయ్యింది. ‘అరుంధతి’ ‘బాహుబలి’ ‘రుద్రమదేవి’ ‘భాగమతి’ వంటి సినిమాలతో దేశవ్యాప్తంగా క్రేజ్ సొంతం చేసుకుంది. కేవలం గ్లామరస్ పాత్రలే కాకుండా.. క్యారెక్టర్ కోసం తన శరీరాకృతిని మార్చుకోని బొద్దుగా మారిపోయింది. అరుంధతి, బాహుబలి, భాగమతి వంటి చిత్రాల్లో తన నటన పరంగా అనుష్క సినీ విశ్లేషకుల నుంచి ప్రశంసలు అందుకుంది. బాహుబలి సినిమా తర్వాత స్పీడ్ తగ్గించిన స్వీటీ. ఆ తర్వాత భాగమతి సినిమా చేసింది. ఈ సినిమా అనుకున్నంత విజయం ఆశించనప్పటికీ పర్వాలేదు అనిపించుకుంది. అలాగే చివరిగా వచ్చిన నిశ్శబ్దం సినిమా దారుణంగా నిరాశపరిచింది. ఇదిలా ఉంటే ఇప్పుడు అనుష్క ఓ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రలో నటిస్తోన్న సినిమాలో అనుష్క కూడా నటిస్తోంది.

ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాకు ‘మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి’ అనే టైటిల్ ను అనుకుంటున్నారట.అలాగే ఈ సినిమాలో అనుష్క విభిన్న పాత్రలో కనిపించనుందట. ఓ అంతర్జాతీయ చెఫ్ పాత్రలో అనుష్క కనిపిస్తుందనేని ఆ టాక్. మరోవైపు ఈ పాత్రలో ఒదిగిపోవడానికి ఆమె వంటలపై పట్టు సాధించే పనిలో ఉందట. విభిన్నమైన వంటకాలు, వాటి రెసిపీలు తెలుసుకునే పనిలో స్వీటీ ఉందని చెపుతున్నారు. ఈ సినిమాకు మహేష్ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో సందీప్ కిషన్ నటించిన రారా కృష్ణయ్య సినిమాకు  ఆయన దర్శకత్వం వహించాడు. UV క్రియేషన్స్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇంతకముందు ఇదే బ్యానర్ లో ‘మిర్చి’ ‘భాగమతి’ సినిమాల్లో నటించింది. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని టాక్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

నటిపై అత్యాచారం కేసులో ట్విస్ట్.. మరో మహిళ ఆరోపణలతో మలయాళీ నటుడిపై రెండో కేసు నమోదు..

Bollywood vs Sandalwood: లాంగ్వేజ్‌ లడాయి.. పొలిటికల్ టర్న్ తీసుకున్న హిందీ భాష వివాదం..

Sarkaru Vaari Paata: మహేష్ ఫ్యాన్స్‏కు అదిరిపోయే న్యూస్ చెప్పిన సర్కారు వారి పాట ఎడిటర్..