AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: మరీ ఇలా తయారేంట్రా బాబు.. మలద్వారంలో కూడానా..!

అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నా.. బంగారం అక్రమ రవాణా ఆగడం లేదు. తాజాగా స్మగ్లర్ల నుంచి ఏడు కిలోల బంగారాన్ని సీజ్ చేశారు అధికారులు. లోదుస్తులతో పాటు మలద్వారంలో బంగారాన్ని తీసుకువస్తూ పట్టుబడ్డారు నిందితులు.

Viral: మరీ ఇలా తయారేంట్రా బాబు.. మలద్వారంలో కూడానా..!
Crime News
Ram Naramaneni
|

Updated on: Apr 30, 2022 | 6:48 PM

Share

స్మగ్లింగ్‌ రాయుళ్లు రోజురోజుకీ తెలివి మీరుతున్నారు. బంగారం అక్రమ రవాణా కోసం ఎంతకైనా తెగిస్తున్నారు కేటుగాళ్లు. అధికారులు ఎన్ని రకాల చర్యలు చేపట్టినా  అక్రమ దందా మాత్రం ఆగడం లేదు. గోల్డ్ రవాణా నిత్యకృత్యంగా మారుతోంది. అంతర్జాతీయ విమానాశ్రయాల్లో రోజూ బంగారం పట్టుబడుతూనే ఉంది. తాజాగా కేరళ(kerala)లో భారీగా అక్రమ బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. కరిపుర్ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌(Karipur International Airport)లో ల్యాండ్ అయిన ఓ విమానంలోని ప్రయాణికుల నుంచి 7 కేజీల బంగారాన్ని సీజ్ చేశారు. లో దుస్తులు, మలద్వారంలో బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్నారని అధికారులు వెల్లడించారు. విశ్వసనీయ వర్గాల నుంచి పక్కా సమచారం అందిందని.. ఈ మేరకు పగడ్బందీ చర్చలు తీసుకొని స్మగ్లర్లను గుర్తించామని అధికారులు పేర్కొన్నారు. నిందితులను అబ్దుల్ సమద్, సాఫ్నాలని.. వారిద్దరూ భార్యాభర్తలని చెప్పారు. అమ్మినిక్కడ్‌కు చెందిన వీరిద్దరూ ఇమ్మిగ్రేషన్ వద్దకు రాగానే అధికారులు అడ్డుకున్నారు. సాఫ్నా ఐదు నెలల ప్రెగ్నెంట్ అని అధికారులు విచారణలో తేలింది. చికిత్స కోసం వెళ్తున్నట్టు చెప్పి అధికారులను మోసం చేయొచ్చని.. నిందితులు భావించారు. అందుకే భారీగా సామగ్రి తీసుకొచ్చారు. నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు.. తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read:  Viral: రైతు పొలం దున్నుతుండగా బయటపడిన అద్భుతం.. ఆనందంలో అన్నదాత

AP: అనకాపల్లి జిల్లాలో షాకింగ్ ఘటన.. గన్‌తో బెదిరించి పట్టపగలు బ్యాంకులో చోరీ

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..