Viral Video: నడిబజారులో చేతిపంపు వద్ద స్నానం చేసిన రాష్ట్ర మంత్రి.. అంత కష్టం ఎమొచ్చిందబ్బా!

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలోని కేబినెట్ మంత్రి నంద్ గోపాల్ గుప్తాకు సంబంధించిన కొన్ని చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Viral Video: నడిబజారులో చేతిపంపు వద్ద స్నానం చేసిన రాష్ట్ర మంత్రి.. అంత కష్టం ఎమొచ్చిందబ్బా!
Nand Gopal Nandi
Follow us
Balaraju Goud

|

Updated on: Apr 30, 2022 | 6:54 PM

Minister Nand Gopal Nandi: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలోని కేబినెట్ మంత్రి నంద్ గోపాల్ గుప్తాకు సంబంధించిన కొన్ని చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రాలలో, అతను రోడ్డు పక్కన ఉన్న చేతిపంపు వద్ద స్నానం చేస్తున్నారు. కేబినెట్ మంత్రి అయ్యి ఉండి ఇలా ఎందుకు చేశారని రాష్ట్రవ్యాప్తం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన బరేలీ జిల్లాలో చోటుచేసుకున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. అక్కడ అతను రాత్రి విశ్రాంతి కోసం ఒక వ్యక్తి ఇంట్లో బస చేశారు. ఉదయాన్నే లేచి చేతిపంపు కింద కూర్చుని మరీ దేశీ స్టైల్‌లో స్నానం చేశారు.

మంత్రి నంద్ గోపాల్ గుప్తా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారన్న విషయం అందరికి తెలిసిందే. తాజాగా అతని వ్యక్తిగత ఖాతా నుండి కొన్ని చిత్రాలు, వీడియోలతో చేసిన పోస్ట్ హాట్‌ టాపిక్‌గా మారాయి. అందులో అతను చేతిపంపు కింద కూర్చుని దేశీ శైలిలో స్నానం చేస్తున్నారు. దీనికి సంబంధించి, కేబినెట్ మంత్రి నంద్ గోపాల్ తన ట్వీట్‌లో ఇలా వ్రాశారు ‘రాత్రి విశ్రాంతి తర్వాత బరేలీ జిల్లాలోని భరతౌల్ గ్రామంలో మున్నీ దేవి జీ (భార్య దివంగత అమర్ సోంకర్ జీ) నివాసంలో బస చేసి, చేతి పంపు నీటితో స్నానం చేయడం ద్వారా రోజు ప్రారంభమైంది.’ అంటూ పేర్కొన్నారు.

ఇదిలావుంటే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ఆదేశాల మేరకు యూపీ కేబినెట్ మంత్రులు వారికి కేటాయించిన జిల్లాల్లో పర్యటిస్తున్నారు. సీఎం యోగి ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు పాలనపై ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తున్నారు. ఈ ఎపిసోడ్‌లో, పారిశ్రామిక అభివృద్ధి మంత్రి నంద్ గోపాల్ గుప్తా అంతకుముందు రోజు బరేలీ జిల్లాకు చేరుకున్నారు. ఇక్కడ ఓ దళితుడి ఇంట్లో రాత్రి విశ్రాంతి తీసుకుని ప్రజలతో మమేకమయ్యారు.

మంత్రి నంద్ గోపాల్ పంచుకున్న చిత్రాలలో, అతను చేతి పంపు దగ్గర కూర్చున్నట్లు కనిపిస్తున్నారు. అతని ముందున్న టబ్ నిండా నీళ్లు. చిత్రాలలో, ఆయన దేశీ స్టైల్‌లో స్నానం చేస్తున్నట్లు చూడవచ్చు. కేబినెట్ మంత్రి కూడా తన స్నానం వీడియోను షేర్ చేశారు. వేలల్లో వీక్షణలు వచ్చాయి. ‘నంద్ గోపాల్’ ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్ నగరంలోని దక్షిణ అసెంబ్లీ స్థానం నుండి ఎమ్మెల్యేగా ఉన్నారు.

Read Also…. Prashant Kishor: మోడీని ఎలా ఓడించాలో ప్రజెంటేషన్ ఇవ్వలేదు.. ప్రశాంత్ కిషోర్ ఆసక్తికర వ్యాఖ్యలు