Viral: రైతు పొలం దున్నుతుండగా బయటపడిన అద్భుతం.. ఆనందంలో అన్నదాత

గాజా తీరానికి దక్షిణాన ఉన్న ఖాన్ యూనిస్ ప్రాంతంలోని భూమిని తవ్వుతోన్న రైతుకు ఈ దేవతా విగ్రహం దొరికింది. ఇది తన పొలంలో దొరకడం గర్వంగా భావిస్తున్నానని ఆ రైతు చెబుతున్నాడు.

Viral: రైతు పొలం దున్నుతుండగా బయటపడిన అద్భుతం.. ఆనందంలో అన్నదాత
representative image
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 28, 2022 | 8:09 PM

Canaanite religion: గాజాలో అరుదైన ఇన్సిడెంట్ చోటుచేసుకుంది. దాదాపు 4500 ఏళ్ల నాటి పురాతన దేవతా విగ్రహం బయటపడింది. గాజా తీరానికి దక్షిణాన ఉన్న ఖాన్ యూనిస్ ప్రాంతంలోని భూమిని తవ్వుతోన్న రైతు(Gaza farmer)నిదాల్ అబు ఈద్‌కు ఈ దేవతా విగ్రహం దొరికింది. ఇది తన పొలంలో దొరకడం అదృష్టంగా భావిస్తున్నానని ఆ రైతు చెబుతున్నారు.  ఆ విగ్రహం… కాంస్య యుగానికి చెందిన క్యానానైట్ల దేవత ‘అనత్’ తల అని పాలస్తీనా పరిశోధకులు చెప్పారు. అది…  ప్రేమ, అందం, యుద్ధ దేవతగా పిలిచే క్యానానైట్ దేవతామూర్తిగా తెలిపారు. ఈ విగ్రహం 22 సెంటీమీటర్ల ఎత్తు ఉంది. దానిపై దేవత ముఖం, తలపై పాము కిరీటం క్లియర్‌గా కనబడుతుంది. ప్రస్తుతం ఈ విగ్రహాన్ని గాజాలోని చరిత్రత్మాక మ్యూజియం ‘ఖజర్ అల్-బష్రా’లో భద్రపరిచారు.  ఇలాంటి ఆవిష్కరణలు పాలస్తీనా చరిత్రను రుజువు చేస్తాయని.. ఇదే పాలస్తీనా ప్రజల పురాతన క్యానానైట్ల నాగరికత అని పర్యాటక, పురావస్తు మంత్రిత్వ శాఖకు చెందిన ప్రతినిధి జమాల్ అబు రిడా పేర్కొన్నారు. ఈ విగ్రహం కాలాన్ని తట్టుకొని నిలిచిందని వ్యాఖ్యానించారు.

Canaanite Goddess

Canaanite Goddess

Also Read: AP: గుంటూరు జిల్లాలో మహిళ అనుమానాస్పద మృతి ఘటనలో కొత్త కోణం.. ప్రకంపనలు