Long Tailed Fowl: వామ్మో! ఇదేం కోడి పుంజురా సామి.. దాని తోక పొడవెంతో తెలిస్తే కంగుతింటారు

Majestic Long Tailed Fowl: సర్వసాధారణంగా అందమైన తోక అంటే ముందుగా గుర్తుకొచ్చేది నెమలి(Peacock). తర్వాత కోడి పుంజు(Cock).. అయితే పక్షుల్లో తోక.. పొడవు అంటే వెంటనే గుర్తుకొచ్చేది..

Long Tailed Fowl: వామ్మో! ఇదేం కోడి పుంజురా సామి.. దాని తోక పొడవెంతో తెలిస్తే కంగుతింటారు
Long Tail Chicken Onagadori
Follow us

|

Updated on: Apr 28, 2022 | 7:14 PM

Majestic Long Tailed Fowl: సర్వసాధారణంగా అందమైన తోక అంటే ముందుగా గుర్తుకొచ్చేది నెమలి(Peacock). తర్వాత కోడి పుంజు(Cock).. అయితే పక్షుల్లో తోక.. పొడవు అంటే వెంటనే గుర్తుకొచ్చేది.. ఒనగాడోరి అనే కోడి పుంజు. ఇది అంతరించి పోతున్న జాతి పక్షుల్లో ఒకటి. ఈ అరుదైన కోడి జపాన్(Japan) కు చెందింది.

ఎడో కాలంలో 200+ సంవత్సరాల పాటు బాహ్య ప్రపంచంతో పెద్దగా సంబంధం లేకుండా సంస్కృతి , సంప్రదాయాలను అభివృద్ధి చేసుకుంది..  జపాన్. ఈ దేశంలో తమ వారసత్వ అంశాలను చాలా తీవ్రంగా పరిగణిస్తుంది. ముఖ్యంగా రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో తాము కోల్పోయిన విలువైన స్మారక చిహ్నాలన్నింటిని మళ్ళీ వెలుగులోకి తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకుంది. తమ సమాజం. తమ సంస్కృతిని సజీవంగా ఉంచడానికి భావి తరాలకు అందించడానికి ఇక్కడ ప్రజలు, ప్రభుత్వం ఆసక్తిని చూపిస్తారు. అందుకనే 1600 లలో నిర్మించిన గంభీరమైన కోటలు, అందమైన నిర్మాణాలు, అరుదైన జంతువులు,  ప్రదేశాలు, స్మారక చిహ్నాలను జపాన్ ప్రభుత్వం సాంస్కృతిక ఆస్తులుగా ప్రకటించబడింది.. వాటిని రక్షిస్తోంది. అలాంటి అరుదైన జాతి పెంపుడు పక్షుల్లో ఒకటి “ఒనగాడోరి”.

“ఒనగాడోరి” అంటే “గౌరవనీయమైన కోడి” అని అర్ధం. ఈ అందమైన జపనీస్ చికెన్ జాతికి జపాన్‌లో ఎంతో గౌరవం ఉంది. ఈ కోడికి 1952 లో “నేషనల్ ట్రెజర్” అనే బిరుదు లభించింది. ఒనగడోరి దేశంలో గొప్ప హోదా ఉన్నప్పటికీ.. అంతరించిపోతున్న అరుదైన తోక గల కోడిగా మారింది.  ఆ దేశంలో కేవలం 250 మాత్రమే “ఒనగాడోరి” కోళ్లు మిగిలి ఉందని అంచనా వేశారు.

పొడవైన తోకలు కలిగిన పక్షులు, జంతువుల్లో తిరుగులేని విజేత ఒనగడోరి. ఎందుకంటే దీని తోక జీవితాంతం ఎదుగుతూనే ఉంటుంది. సంతానోత్పత్తిని కూడా అదే విధంగా చేస్తుంది. నమ్మశక్యం కాని పొడవైన తోకతో ఒక జాతిని సృష్టించడం సాధ్యమైంది. దీని తోక సగటు పొడవు 4 నుండి 9 మీటర్ల వరకు ఉంటుంది. కానీ ఒనగడోరిలో రికార్డ్ సృష్టించిన తోక పొడవు.. 13 మీటర్ల కంటే ఎక్కువ.

ఒనగడోరి కోడి గుడ్లు దేశం నుండి బయటకు తీసుకుని వెళ్లడం అనుమతిలేదు. ఈ కోడి గుడ్లు ఎగుమతి చేయబడవు. అలా అనుమతి లేకుండా ఎగుమతి చేస్తే.. అక్రమ రవాణాగా పరిగణింపబడుతుంది.

ఒనగడోరి కోడి పొడవైన తోకతో అందరినీ ఆకర్షిస్తోంది. మగ ఒనగడోరి సగటు బరువు 1.8 కిలోలు (3.9 పౌండ్లు), ఆడ ఒనగడోరి సగటు బరువు 1.35 కిలోలు (2.9 పౌండ్లు). దీని సాధారణ చర్మం రంగు పసుపు రంగులో ఉంటుంది. ఇది లేత గోధుమరంగు గుడ్లు పెడుతుంది.

జపాన్‌లో అనేక రకాల కోళ్లు ఉన్నాయి, వీటిని స్థానికంగా నిర్దిష్ట ఉపయోగాల కోసం పెంచుతారు, ఒనగడోరి అనేది ప్రదర్శన కోసం ఉపయోగించే ఒక జాతి. ఇది ఇప్పటికీ “గాలస్ గాలస్ డొమెస్టిక్స్” అనే శాస్త్రీయ నామాన్ని కలిగి ఉన్న “చికెన్” వర్గీకరణ క్రిందకు వస్తుంది. చాలా మంది ఈ కోడి జాతిని ఫీనిక్స్ జాతిగా పొరబడుతుంటారు. ఎదుకంటే కోడి జాతికి, ఫీనిక్స్ జాతికి మధ్య ఒకదానికొకటి దగ్గరి సంబంధం కలిగి ఉన్నాయి.

Also Read: Hindi Row: కర్ణాటకలో రాజుకున్న మరో వివాదం.. కన్నడ నటుడిని సమర్థించిన కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై

Viral Video: రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని ఢీ కొట్టి పారిపోతున్న కుక్క.. హిట్ అండ్ రన్ కేసు నమోదు చేయమంటున్ననెటిజన్లు

నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.
కేటీఆర్ పర్యటనకు డుమ్మా కొట్టిన వరంగల్ మేయర్..!
కేటీఆర్ పర్యటనకు డుమ్మా కొట్టిన వరంగల్ మేయర్..!
లగేజ్‌లో నూడుల్స్ ప్యాకెట్.... అనుమానంతో ఓపెన్ చేయగా..
లగేజ్‌లో నూడుల్స్ ప్యాకెట్.... అనుమానంతో ఓపెన్ చేయగా..
ఒక్కో డ్రింక్ బ్రహ్మాస్త్రమే.. ఈ 4 పానీయాలు తాగితే..
ఒక్కో డ్రింక్ బ్రహ్మాస్త్రమే.. ఈ 4 పానీయాలు తాగితే..
వెయిట్‌ చేయమంటున్న మహేష్ బాబు.! గిఫ్ట్ ప్యాక్‌ చేస్తున్న రాజమౌళి.
వెయిట్‌ చేయమంటున్న మహేష్ బాబు.! గిఫ్ట్ ప్యాక్‌ చేస్తున్న రాజమౌళి.
కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుందో తెలియదు - కేసీఆర్
కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుందో తెలియదు - కేసీఆర్
ముస్లింలను OBC జాబితాలో చేర్చిన ఆ రాష్ట్ర సర్కార్
ముస్లింలను OBC జాబితాలో చేర్చిన ఆ రాష్ట్ర సర్కార్
ఇతను రీల్ మాత్రమే కాదు.. రియల్ హీరో కూడా.... సాయం అనగానే..
ఇతను రీల్ మాత్రమే కాదు.. రియల్ హీరో కూడా.... సాయం అనగానే..