Viral Video: రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని ఢీ కొట్టి పారిపోతున్న కుక్క.. హిట్ అండ్ రన్ కేసు నమోదు చేయమంటున్ననెటిజన్లు
Dog Viral Video: జంతువులకు సంబంధించిన వీడియోలు ప్రతిరోజూ సోషల్ మీడియాలో(Social Media) వైరల్ అవుతున్నాయి . ఎన్నిసార్లు చూసినా కొన్ని వీడియోలు నవ్వు కునే విధంగా ఉంటున్నాయి..
Dog Viral Video: జంతువులకు సంబంధించిన వీడియోలు ప్రతిరోజూ సోషల్ మీడియాలో(Social Media) వైరల్ అవుతున్నాయి . ఎన్నిసార్లు చూసినా కొన్ని వీడియోలు నవ్వు కునే విధంగా ఉంటున్నాయి. తాజాగా ఓ వీధి కుక్కకు సంబంధించిన ఫన్నీ వీడియో(Funny Dog Videos) సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీడియో చూసిన అనంతరం ఇంటర్నెట్ వినియోగదారులు ఇది స్పష్టమైన హిట్ అండ్ రన్ కేసు అంటూ ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియోలో.. ఓ కుక్క పార్కింగ్ స్థలం బయటకు వస్తూ రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని ఢీ కొట్టి.. పారిపోతున్నట్లు చూడవచ్చు. కనుక కుక్కపై హిట్ అండ్ రన్ కేసు నమోదు చేయాలంటున్నారు నెటిజన్లు..
వైరల్ అయిన సీసీటీవీ ఫుటేజీలో, పార్కింగ్ స్థలంలో తెల్లటి రంగు కారుని ఓ వ్యక్తి పార్క్ చేయడాన్ని మీరు చూడవచ్చు. అనంతరం ఆ వ్యక్తి.. కారునుంచి దిగి.. పార్కింగ్ వెలుపలకు వచ్చి రోడ్డు దాటే ప్రయత్నం చేస్తున్నాడు. రోడ్డుకు ఇరువైపులా చూస్తూ రోడ్డు దాటడం మొదలు పెట్టాడు. ఇంతలో ఓ కుక్క అతివేగంతో వచ్చి రోడ్డు దాటడానికి ప్రత్నిస్తున్న వ్యక్తిని గట్టిగా ఢీ కొట్టింది. కుక్క ఢీకొన్న తర్వాత ఆ వ్యక్తి రోడ్డుపై పడిపోయాడు. తేరుకున్న వ్యక్తి.. లేచి నిల్చుకుని తనకు ఏమైందో అంటూ దిక్కులు చూడడం కనిపిస్తుంది.
కుక్క హిట్ అండ్ రన్ వీడియో:
View this post on Instagram
ఈ వీడియో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో 24 గంటల క్రితం అప్‌లోడ్ చేసిన ఈ వీడియో 2 లక్షల 84 వేల మందికి పైగా లైక్ చేశారు. ఈ సంఖ్య నిరంతరం పెరుగుతోంది. అదే సమయంలో, వీడియోను చూసిన అనంతరం నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. కుక్క ఉద్దేశ్య పూర్వకంగా ఢీ కొట్టలేదు అని ఒకరు కామెంట్ చేస్తే.. ‘సీసీటీవీలో ఇప్పటివరకు దొరికిన అతిపెద్ద హిట్ అండ్ రన్ కేసు అంటూ మరొకరు కామెంట్ చేశారు. మొత్తం మీద ఈ ఫన్నీ వీడియో భారీగా లైక్స్ ను సొంతం చేసుకోవడమేకాదు… వ్యూవర్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు కూడా.
Also Read: Hyderabad Rains: ఉక్కబోతతో తల్లడిల్లుతున్న పట్టణజీవికి ఉపశమనం.. వర్షపు జల్లులతో పులకరించిన నగరం