Hyderabad Rains: ఉక్కబోతతో తల్లడిల్లుతున్న పట్టణజీవికి ఉపశమనం.. వర్షపు జల్లులతో పులకరించిన నగరం
Hyderabad Rains: తెలంగాణాలో(Telangana) నడి వేసవిలో విచిత్ర వాతావరణం నెలకొంది. పగలంతా నిప్పుల కుంపటి.. సూర్య భగవానుడి భగభగలు.. 40-45 డిగ్రీల ఉష్ణోగ్రతలు.. సాయంకాలం ఒక్కసారిగా..
Hyderabad Rains: తెలంగాణాలో(Telangana) నడి వేసవిలో విచిత్ర వాతావరణం నెలకొంది. పగలంతా నిప్పుల కుంపటి.. సూర్య భగవానుడి భగభగలు.. 40-45 డిగ్రీల ఉష్ణోగ్రతలు.. సాయంకాలం ఒక్కసారిగా అనూహ్య మార్పు చోటు చేసుకున్నాయి. ఒక్కసారిగా మబ్బులు కమ్ముకొచ్చాయి. గాలి దుమారం తోడైంది. ఉరుములు, మెరుపులు.. ఈదురుగాలులు..! నడి వేసవిలో హైదరాబాద్ నగరం తో సహా తెలంగాణ రాష్ట్రమంతా వానజల్లులు పడ్డాయి. దీంతో ఉక్కపోతతో తల్లడిల్లుతున్న పట్టణజీవికి కొంచెం ఉపశమనం లభించింది. పట్టణ వాసులు వర్షపు జల్లులతో పులకరించారు. మండే ఎండల నుంచి కాస్తంత ఉపశమనం కలిగినట్లయింది.
Heavy Rain Now in Jeedimetla with Gusty winds⛈️
Enjoying Cool Weather ?❤️#Hyderabadrains @balaji25_t @TS_AP_Weather @Rajani_Weather @HYDmeterologist pic.twitter.com/H6hlCW3JHS
— Hyderabad Rains (@Hyderabadrains) April 28, 2022
మండు వేసవిలో వరుణుడు దంచికొట్టాడు. గురువారం హైదరాబాద్‌తోపాటు పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వాన కురిసింది. ఒక్కసారిగా కురిసిన వర్షంతో పలు ప్రాంతాల్లో పంటలకు నష్టం జరిగింది. గురువారం సాయంత్రం వరకు ఎండలు దంచి కొట్టాయి. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఆకాశం మబ్బులు కమ్మింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది.
మరిన్ని వాతావరణ వార్తలకు ఈ లింక్ ను క్లిక్ చేయండి..
Also Read: KTR GOOGLE: హైదరాబాద్ సిగలో మరో మణిహారం.. టెక్ దిగ్గజం గూగుల్ వారి రెండో అతిపెద్ద క్యాంపస్
Kanipakam: రేపటి నుంచి వరసిద్ధి వినాయకుడి గుడిలో ఉచిత అన్నదాన కార్యక్రమం.. ఆగస్టు 7న మహా కుంభాభిషేకం