Viral Video: వధువు అప్పగింతల సమయంలో అకస్మాత్తుగా ఏడ్చిన వరుడు.. ఫన్నీ వీడియో నెట్టింట్లో వైరల్
Viral Video: పెళ్లికి సంబంధించిన ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో(Social Media) హల్ చల్ చేస్తున్నాయి . వీటిలో కొన్నింటిని చూసి ఉద్వేగానికి లోనవుతారు.. మరి కొన్నింటిని చూస్తే నవ్వును..
Viral Video: పెళ్లికి సంబంధించిన ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో(Social Media) హల్ చల్ చేస్తున్నాయి . వీటిలో కొన్నింటిని చూసి ఉద్వేగానికి లోనవుతారు.. మరి కొన్నింటిని చూస్తే నవ్వును అదుపు చేసుకోలేరు. అదే సమయంలో.. ఇలాంటివి ఎప్పుడైనా జరుగుతాయా అంటూ ఆశ్చర్యపోయేలా కొన్ని వీడియోలు ఉన్నాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పెళ్లి వీడియోలో ఓ ఫన్నీ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. ఈ వీడియోలో వధువుకు బదులుగా వరుడు తీవ్రంగా ఏడుస్తూ కనిపించాడు ( దుల్హా క్రయింగ్ వీడియో ). అయితే వరుడు అకస్మాత్తుగా ఇలా ఎడ్వడం సరదాగా నవ్వులు పూయించేందుకు ఉద్దేశపూర్వకంగా ఇలా చేసినట్లు వీడియో చూస్తే ఎవరికైనా అర్ధమవుతుంది. ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా నవ్వకుండా ఉండలేరు.
వైరల్‌గా మారిన ఈ వీడియో పెళ్లి వేడుక ముసిగిన అనంతరం.. పెళ్లికూతురు వీడ్కోలు చెప్పే సమయంలోనిదని తెలుస్తోంది. పెళ్లికూతురు అప్పగింతల సమయంలో పెళ్లి కూతురుకి బదులు వరుడు హఠాత్తుగా కెమెరా వైపు చూసి వెక్కి వెక్కి ఏడుస్తున్నట్లు నటించడం మొదలు పెట్టాడు. ఇది చూసిన వధువు మొదట షాక్ తింది. అయితే పెళ్లికొడుకు కావాలనే ఇలా చేస్తున్నాడని అర్ధమయిన తర్వాత వధువు నవ్వుతుంది. వరుడి చేసిన పనికి పెళ్ళికి వచ్చిన బంధువుల ముఖాల్లోనూ చిరునవ్వు వెల్లివిరిసింది.
పెళ్లికొడుకు ఏడవడం మొదలుపెట్టాక!
View this post on Instagram
వీడియో షేర్ చేస్తూ.. పెళ్లి వేడుకలో నాటకం గరిష్ట స్థాయికి చేరుకుంది. ఈ వీడియోలో వరుడు సరిగ్గా అదే చేస్తున్నాడంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియో పై స్పందిస్తూ.. వరుడు చేసింది.. ఓవర్ యాక్టింగ్ .. అయినా ఈ క్షణం చాలా ప్రత్యేకమైంది. ఏ వరుడైనా పెళ్లి తర్వాత తన భవిష్యత్తు త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. ఇక్కడ కూడా అబ్బాయి అలాంటిదే చేస్తున్నాడు. అని కామెంట్ చేశారు. వధూవరుల ఈ ఫన్నీ వీడియో witty_wedding అనే పేజీ నుండి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. వరుడిని ఏడిపించబోతున్న వధువు అంటూ ట్యాగ్ చేశారు.
Also Read: Long Tailed Fowl: వామ్మో! ఇదేం కోడి పుంజురా సామి.. దాని తోక పొడవెంతో తెలిస్తే కంగుతింటారు
పగిలిన పెదవులు అందంగా కనిపించేలా చేసే నేచురల్ టిప్స్..(Web Story)