Crypto Currencies: క్రిప్టో కరెన్సీలపై కీలక వ్యాఖ్యలు చేసిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్..!

Crypto Currencies: మన దేశంలో క్రిప్టో కరెన్సీలకు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కరోనా తరువాత డిజిటల్ ఎసెట్స్(Digital assets), క్రిప్టో కాయిన్స్ పెట్టుబడులు దేశంలో భారీగా పెరిగాయి.

Crypto Currencies: క్రిప్టో కరెన్సీలపై కీలక వ్యాఖ్యలు చేసిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్..!
Crypto Currencies
Follow us

|

Updated on: Apr 28, 2022 | 8:30 PM

Crypto Currencies: మన దేశంలో క్రిప్టో కరెన్సీలకు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కరోనా తరువాత డిజిటల్ ఎసెట్స్(Digital assets), క్రిప్టో కాయిన్స్, స్టాక్ మార్కెట్ల(Stock Markets) వంటి వాటిలో ఎక్కువ మంది రిటైలర్లు పెట్టుబడులు పెడుతున్నారు. ఈ తరుణంలో బడ్జెట్ సమయంలో క్రిప్టో ఆదాయాలపై ఏకంగా 30 శాతం పన్నుతో పాటు, చెల్లింపుల్లో టీడీఎస్ కూడా వసూలు చేస్తామని కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ తరుణంలో.. క్రిప్టో కరెన్సీల నియంత్రణపై భారత్ చాలా జాగ్రత్తగా వ్యవహరించి నిర్ణయం తీసుకుంటుందంటూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ డిజిటల్ కరెన్సీలపై తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోబోమని స్పష్టం చేశారు. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. తమ వద్ద అందుబాటులో ఉన్న సమాచారం మేరకు నిర్ణయం తీసుకోవలసి ఉంటుందని.. సరైన నిర్ణయాలు తీసుకోవటానికి మరింత సమయం పడుతుందని నిర్మల అభిప్రాయపడ్డారు.

క్రిప్టో డిజిటల్ ఆస్తులకు సంబంధించి అన్ని విషయాలను తప్పక పరిగణలోకి తీసుకోనున్నట్లు ఆమె తెలిపారు. ఆ తరువాతే క్రిప్టో రెగ్యులేషన్స్ పై తుది నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు. క్రిప్టో కరెన్సీలను మనీ లాండరింగ్ నుంచి ఉగ్రవాదానికి నిధులు సమకూర్చే వరకూ అనేకమైన మార్గాల్లో దుర్వినియోగం చేస్తున్నారని ఆర్థిక మంత్రి అన్నారు. అంతేకాక అన్ని దేశాలు కలిసి కట్టుగా ఈ కరెన్సీలపై పోరాడాలని పిలుపునిచ్చారు. ఇవి దేశాల ఆర్థిక స్థిరత్వానికి అత్యంత ప్రమాదకరమని గతంలోనే అన్నారు. ఈ విషయంలో కేవలం భారత్ మాత్రమే కాకుండా.. అనేక ఇతర దేశాలు కూడా ఇదే ఆలోచనలో ఉన్నాయన్నారు. అందరూ కలిసికట్టుగా ఈ ప్రమాదం నుంచి భయటపడాలని.. అందుకు ముందుగా ఆందోళలను పరిష్కరించాలని అన్నారు.

క్రిప్టో కరెన్సీలకు చెక్ పెట్టేందుకు రిజర్వు బ్యాంక్ సొంతంగా డిజిటల్ కరెన్సీని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఈ విషయాన్ని ఆర్థిక మంత్రి తన బడ్జెట్‌ ప్రసంగంలోనే పేర్కొన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆర్‌బీఐ డిజిటల్ రూపీని లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఇవీ చదవండి..

Vijaya Gadde: తెలుగు మహిళను టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్.. ట్విట్టర్ ని కొన్న వెంటనే ఎందుకిలా చేస్తున్నాడంటే..

Elon Musk: ఎలాన్ మస్క్ విచిత్ర ప్రవర్తనకు ఒక వ్యాధి కారణమని తెలుసా.. ఇంతకీ దాని లక్షణాలేంటంటే..

వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు
పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు
పెళ్లినా.. పాప తగ్గడంలేదుగా.. ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసిన రకుల్
పెళ్లినా.. పాప తగ్గడంలేదుగా.. ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసిన రకుల్