Aishwarya Rai: సౌత్ సినిమాల పై ఫోకస్ పెట్టిన అందాల ఐశ్వర్య.. మరోసారి ఆ స్టార్ హీరోతో మూవీ..?
ఐ లవ్ సౌత్ అనే స్లోగన్ ఇప్పుడు నార్త్‌లో గట్టిగా వినిపిస్తోంది. కంగనా రనౌత్ నుంచి సల్మాన్ ఖాన్ దాకా... ఉత్తరాదిలో బిగ్ స్టార్స్ అందరూ సౌత్ వైపే ఆశగా చూస్తున్నారు
ఐ లవ్ సౌత్ అనే స్లోగన్ ఇప్పుడు నార్త్‌లో గట్టిగా వినిపిస్తోంది. కంగనా రనౌత్(Kangana Ranaut)నుంచి సల్మాన్ ఖాన్ దాకా.. ఉత్తరాదిలో బిగ్ స్టార్స్ అందరూ సౌత్ వైపే ఆశగా చూస్తున్నారు. అటువైపుండే టాప్ హీరోయిన్స్ కూడా ఇటువైపు సినిమాల్లో నటించడాన్నే గర్వంగా ఫీలవుతున్నారు. ఆ లిస్టులో లేటెస్ట్ ఎంట్రీ ఐశ్వర్యా రాయ్( Aishwarya Rai). గురు, ధూమ్2, కుఛ్ నా కహో, బంటీ ఔట్ బబ్లీ.. ఇలా అరడజను దాకా సినిమాల్లో కలిసి నటించారు రియల్ కపుల్ ఐశ్ అండ్ అభి. టైమ్ కలిసొస్తే మరోసారి స్క్రీన్ మీద సింగిల్ ఫ్రేమ్‌లో మేమిద్దరం కనిపిస్తాం అని రీసెంట్‌గా హింట్ ఇచ్చారు ఛోటా బచ్చన్. కానీ.. ఐశ్వర్యా బచ్చన్ చూపు మాత్రం మరో వైపుందట. సెకండ్ ఇన్నింగ్స్‌లో తన ఫేట్‌ని సౌత్‌లోనే వెతుక్కుంటున్నారు విశ్వసుందరి.
తమిళ్ సినిమాతోనే సిల్వర్ స్క్రీన్‌కి పరిచయమయ్యారు ఐశ్వర్య. మిస్ వరల్డ్ అయ్యీ కాగానే ఆమెను ఇద్దరు మూవీతో ఆడియన్స్‌కి ఇంట్రడ్యూస్ చేశారు మణిరత్నం. తర్వాత హిందీలో ఎన్ని సినిమాలు చేసినా.. మణీస్ మేజిక్‌తోనే ఐశ్‌కి మంచి ఎప్లాజ్ వచ్చింది. గురు, రావణన్ సినిమాలు కమర్షియల్‌గా ఓ మోస్తరుగా ఆడినా.. వాటిని తన మనసుకు నచ్చిన సినిమాలని ఓపెన్‌గా చెప్పారామె. ఐశ్వర్యా రాయ్ నయా ఇన్నింగ్స్‌ని కూడా మణి మాస్టర్‌తోనే షురూ చేస్తున్నారు. మూడు పార్టులుగా రాబోయే పొన్నియన్ సెల్వన్ ఐశ్వర్యను బిజీగా మార్చబోతోంది. ఇదే గ్యాప్‌లో మరికొన్ని సౌత్ ప్రాజెక్టుల్ని కూడా పరిశీలిస్తున్నారట ఐశ్వర్యారాయ్. సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో రెండోసారి మింగిల్ కాబోతున్నారన్నది తాజా ఖబర్. పన్నెండేళ్ల కిందట రోబో ఫస్ట్ చాప్టర్‌లో నటించి.. దక్షిణాది ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించుకున్నారు ఐశ్వర్య. రజనీకాంత్‌కి పర్‌ఫెక్ట్ జోడీ అనే కాంప్లిమెంట్ కూడా సంపాదించుకున్నారు. లేటెస్ట్‌గా నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న నెక్స్ట్ రజనీ మూవీలో ఐశ్వర్య మెయిన్ ఫిమేల్ లీడ్‌లో నటించే ఛాన్సుంది. ఈలెక్కన.. దీపికా, ఆలియా లాగే.. మాజీ విశ్వసుందరి ఐశ్వర్య మనసు కూడా దక్షిణం దిక్కువైపే చూస్తోందన్నమాట.
మరిన్ని ఇక్కడ చదవండి :