Ritu Chaudhary: బెట్టింగ్ యాప్ కేసు.. పోలీస్ స్టేషన్కు రీతూ చౌదరి.. విచారణలో ఏం చెప్పిందంటే..
తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు సంచలనం సృష్టింస్తోంది. ఈ కేసులో సెలబ్రెటీలకు ఉచ్చిబిగిస్తోంది. యూట్యూబర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, సినీతారలపై కేసులు నమోదు చేసింది. ఇప్పటికే పలువురు తారలు పోలీసు విచారణకు హాజరయ్యారు. గురువారం ఉదయం తన లాయర్ తో కలిసి పోలీసు విచారణకు హాజరైంది విష్ణుప్రియ. అనంతరం రీతూ చౌదరి సైతం పోలీసుల విచారణకు వచ్చింది.

తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. యూట్యూబర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, నటీనటులపై కేసులు నమోదు చేసి నోటీసులు జారీ చేశారు పోలీసులు. ఇప్పటికే యాంకర్ విష్ణు ప్రియ, రీతూ చౌదరి పోలీసుల విచారణకు హాజరయ్యారు. కాగా గురువారం విష్ణుప్రియను పంజాగుట్ట పోలీసులు దాదాపు 3 గంటలపాటు విచారించారు. తన లాయర్ తో కలిసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు వచ్చింది. ఈ విచారణలో విష్ణు ప్రియ పలు కీలక విషయాలను వెల్లడించినట్లు తెలుస్తోంది. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసినట్లు పోలీసుల ఎదుట అంగీకరించింది.
ఇక గురువారం మధ్యాహ్నం యాంకర్ రీతూ చౌదరీ సైతం పోలీసుల విచారణకు హాజరయ్యింది. విచారణ అనంతరం రీతూ చౌదరీ ఓ వీడియోను విడుదల చేశారు. తెలిసో తెలియకో తాను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి తప్పు చేశానని ఒప్పుకున్నారు. గతంలో చేశానని.. బెట్టింగ్ యాప్స్ ను ఎవరూ నమ్మకండి అంటూ చెప్పింది. వాటిని నమ్మి ఎవరూ డబ్బులు మోసపోవద్దని రీతూ వీడియోలో పేర్కొంది.
మరోవైపు విష్ణుప్రియ దాదాపు 15 రకాల బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసినట్లు పోలీసులకు వివరించింది. అలా ఒక్కో యాప్ కు దాదాపు రూ.90 వేలు ఆదాయం వచ్చినట్లు తెలిసింది. ఈ విచారణలో విష్ణుప్రియ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు ఆమె మొబైల్ ఫోన్ సీజ్ చేశారు. ఈ కేసులో ఆమెను సుమారుగా రెండు గంటలకు పైగా విచారించినట్లు తెలుస్తోంది.
ఇది చదవండి : Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..
Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?
Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..