AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anand Deverakonda: రష్మిక ఎందుకు చెప్పిందో తెలియదు.. ఆనంద్ దేవరకొండ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ముఖ్య అతిథిగా హాజరై సందడి చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈ వేడుకలో రష్మిక, ఆనంద్ మధ్య జరిగిన ఫన్నీ సంభాషణ ఆకట్టుకుంది. ఈ ఈవెంట్లో రష్మికను తన ప్రశ్నలతో ఓ ఆటాడుకున్నాడు ఆనంద్. ఇందుకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరలయ్యాయి. మే 31న గంగం గణేశా సినిమా రిలీజ్ కాబోతుండడంతో వరుస ఇంటర్వ్యూలో పాల్గొంటున్నాడు ఆనంద్ దేవరకొండ. ఈ సందర్భంగా రష్మిక గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

Anand Deverakonda: రష్మిక ఎందుకు చెప్పిందో తెలియదు.. ఆనంద్ దేవరకొండ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
Rashmika, Anand Deverakonda
Rajitha Chanti
|

Updated on: May 30, 2024 | 9:02 AM

Share

బేబీ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ. ఇందులో అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. లవ్ ఫెయిల్యూర్ అబ్బాయిగా ఆనంద్ నటనకు అడియన్స్ ఫిదా అయ్యారు. బేబీ తర్వాత ఆనంద్ నటిస్తోన్న లేటేస్ట్ సినిమా గం గం గణేశా. ఉదయ్ శెట్టి దర్శకత్వంలో హై లైఫ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మించిన ఈ మూవీలో ప్రగతి శ్రీ వాత్సవ, నయన్ సారిక హీరోయిన్లుగా నటించారు. విడుదలకు ముందు ట్రైలర్, టీజర్, పాటలతో మంచి క్యూరియాసిటిని కలిగించింది ఈ మూవీ. అలాగే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ముఖ్య అతిథిగా హాజరై సందడి చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈ వేడుకలో రష్మిక, ఆనంద్ మధ్య జరిగిన ఫన్నీ సంభాషణ ఆకట్టుకుంది. ఈ ఈవెంట్లో రష్మికను తన ప్రశ్నలతో ఓ ఆటాడుకున్నాడు ఆనంద్. ఇందుకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరలయ్యాయి. మే 31న గంగం గణేశా సినిమా రిలీజ్ కాబోతుండడంతో వరుస ఇంటర్వ్యూలో పాల్గొంటున్నాడు ఆనంద్ దేవరకొండ. ఈ సందర్భంగా రష్మిక గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

బేబీ, గం గం గణేశా సినిమాలు రెండూ ఒకేసారి తన దగ్గరకు వచ్చాయని అన్నారు. కానీ బేబీ కోసం జుట్టు, గడ్డం పెంచడం, అలాగే ఆ సినిమా కోసం సెట్ భారీ వర్షం వల్ల కూలిపోవడం వంటి కారణాలతో గం గం గణేశా సినిమా ఆలస్యమవుతూ వచ్చిందని అన్నారు. వినాయకుడి విగ్రహం నేపథ్యంలో అత్యాశ, భయం, కుట్ర వంటి అంశాల చుట్టూ సాగే కథే ఈ సినిమా అని తెలిపారు. స్వామిరారా తరహా క్రైమ్ కామెడీ సినిమాలంటే తనకు చాలా ఇష్టమని.. డైరెక్టర్ ఉదయ్ శెట్టి చెప్పిన స్టోరీ వినగానే వెంటనే స్వామిరారా గుర్తొచ్చిందని అన్నారు. ఏడిపించడం కంటే నవ్వించడమే చాలా కష్టమని.. ఈ సినిమా స్టోరీ విన్నాక కామెడీ టైమింగ్ పక్కా పట్టుకోగలనా అనే భయం కలిగిందని అన్నారు. కోలీవుడ్ స్టార్ ధనుష్ చేసిన కర్ణన్, అసురన్ వంటి సినిమాలను చేయాలని ఉండేదని.. ఆ కోరిక వినోద్ అనంతోజు రూపొందిస్తున్న సినిమాతో తీరనుందని అన్నారు.

ఇక ఇటీవల గం గం గణేశా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో రష్మిక చేసిన కామెంట్స్ పై రియాక్ట్ అయ్యాడు ఆనంద్. తన సినిమా ప్రమోషన్లలో రష్మిక పాల్గొన్నది రెండు సార్లే అని.. నిజంగానే తాము ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని అన్నారు. అందుకే మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో మనం ఫ్యామిలీ అన్నారని తెలిపారు. ఆ అనుబంధంతోనే తన సినిమా వేడుకలకు రష్మిక వస్తుందని.. కానీ తనపై ఆధారపడుతుంటానని ఎందుకన్నారో తెలియదని అన్నారు ఆనంద్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.