Chiranjeevi : నాని సినిమాల్లో మెగాస్టార్‌కు ఆ మూవీ అంటే చాలా ఇష్టమట.. తెగపొగిడేసిన చిరు
వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నానితో పాటు ఎస్ జే సూర్య నటించారు. అలాగే ప్రియాంక మోహన్ హీరోయిన్ గా చేసింది. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఇప్పుడు నాని ఫుల్ జోష్ లో ఉన్నాడు. అలాగే తన నెక్స్ట్ సినిమాను కూడా అనౌన్స్ చేశాడు ఈ నేచురల్ స్టార్.
నేచురల్ స్టార్ నాని వరుస హిట్స్ తో దూసుకుపోతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటూ టాలీవుడ్ లో రాణిస్తున్నాడు నాని. ఇక ఇప్పుడు సరిపోదా శనివారం సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. వరుసగా దసరా, హాయ్ నాన్న ఇప్పుడు సరిపోదా శనివారం ఇలా హ్యాట్రిక్ కొట్టాడు నాని. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నానితో పాటు ఎస్ జే సూర్య నటించారు. అలాగే ప్రియాంక మోహన్ హీరోయిన్ గా చేసింది. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఇప్పుడు నాని ఫుల్ జోష్ లో ఉన్నాడు. అలాగే తన నెక్స్ట్ సినిమాను కూడా అనౌన్స్ చేశాడు ఈ నేచురల్ స్టార్. నాని ఇప్పుడు హిట్ 3లో నటిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా గ్లింమ్స్ ను రిలీజ్ చేశారు. ఇదిలా ఉంటే నాని సినిమాల్లో మెగాస్టార్ కు ఓ మూవీ అంటే విపరీతమైన ఇష్టమట.
ఈ విషయాన్ని హీరో నాని స్వయంగా చెప్పారు. చిరంజీవి కొత్తవాళ్లను, మంచి సినిమాను అభినందిస్తూ వారికి సోషల్ మీడియా ద్వారా లేదా నేరుగా విషెస్ చెప్పి ప్రోత్సహించడం చేస్తుంటారు. అలానే నాని నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమా పై కూడా మెగాస్టార్ ప్రశంసలు కురిపించారట్. ఆ సినిమా తనను విపరీతంగా ఆకట్టుకుందని మెగాస్టార్ అన్నారట. ఈ విషయాన్ని నాని రీసెంట్ గా సరిపోదా శనివారం ప్రమోషన్స్ లో తెలిపారు.
సరిపోదా శనివారం ప్రమోషన్స్ లో ఉన్న నాని మాట్లాడుతూ.. తన సినిమా ఏది రిలీజ్ అయిన చిరంజీవి తనకు మెసేజ్ చేస్తారు అని చెప్పాడు. దసరా, హాయ్ నాని సమయంలోనూ చిరంజీవి తనకు మెసేజ్ చేసి సినిమా బాగుంది అని మెచ్చుకున్నారు అని నాని అన్నాడు. అలాగే శ్యామ్ సింగరాయ్ సినిమా చిరంజీవికి బాగా నచ్చిందని చెప్పాడు. శ్యామ్ సింగ రాయ్ చిత్రాన్ని చిరు తన సతీమణి సురేఖతో కలసి హోమ్ థియేటర్ లో చూశారట. ఆ సినిమాలో ఆయన బాగా లీనమైపోయారట ఎంతలా అంటే మధ్యలో ఆయన సిబ్బంది ఎవరో స్నాక్స్ తీసుకొస్తే.. ఎందుకు డిస్ట్రబ్ చేస్తావ్ అని అతని తిట్టారంట.. అని నాని తెలిపాడు. అలాగే శ్యామ్ సింగరాయ్ సినిమా గురించి చిరంజీవి, ఆయన భార్య సురేఖ చాలా సేపు తనతో మాట్లాడారని.. మరి మాటలను తాను ఫిదా అయ్యాను అని నాని తెలిపాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.