Nandamuri Mokshagna: మోక్షజ్ఞ ఎంట్రీ ఈ దర్శకుడి సినిమాతోనేనా ??

‘హనుమాన్‌’తో సినీప్రియులను ఆకర్షించారు డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ. తాజాగా ఆయన పెట్టిన ఓ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారి నందమూరి అభిమానుల్లో జోష్‌ పెంచుతోంది. తాజాగా ఓ వానరం సింహం పిల్లను ఎత్తుకొని చూపుతోన్న పోస్ట్‌ పెట్టిన ప్రశాంత్‌ వర్మ.. తన యూనివర్స్‌ నుంచి త్వరలోనే ఓ కొత్త తేజస్సు రానుంది అని రాశారు. దీనికి ‘సింబా ఈజ్‌ కమింగ్‌’ అనే హ్యాష్‌ట్యాగ్‌ పెట్టారు.

Nandamuri Mokshagna: మోక్షజ్ఞ ఎంట్రీ ఈ దర్శకుడి సినిమాతోనేనా ??

|

Updated on: Sep 06, 2024 | 2:07 PM

‘హనుమాన్‌’తో సినీప్రియులను ఆకర్షించారు డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ. తాజాగా ఆయన పెట్టిన ఓ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారి నందమూరి అభిమానుల్లో జోష్‌ పెంచుతోంది. తాజాగా ఓ వానరం సింహం పిల్లను ఎత్తుకొని చూపుతోన్న పోస్ట్‌ పెట్టిన ప్రశాంత్‌ వర్మ.. తన యూనివర్స్‌ నుంచి త్వరలోనే ఓ కొత్త తేజస్సు రానుంది అని రాశారు. దీనికి ‘సింబా ఈజ్‌ కమింగ్‌’ అనే హ్యాష్‌ట్యాగ్‌ పెట్టారు. దీంతో మోక్షజ్ఞ ఎంట్రీని ఉద్దేశించే ప్రశాంత్‌ ఈ పోస్ట్‌ పెట్టారని అందరూ అనుకుంటున్నారు. సెప్టెంబర్‌ 6న దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం బాలయ్య అభిమానులు నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. బాలకృష్ణ కుమారుడు స్క్రీన్‌పై ఎప్పుడు కనిపిస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ప్రశాంతవర్మ దర్శకత్వంలోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని ఎన్నో రోజులుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ పెట్టిన పోస్ట్‌ ఆ వార్తలకు బలం చేకూర్చేలా ఉంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వ‌ర‌ద బాధితుల‌కు రూ.100 కోట్ల విరాళం ప్రకటించిన ప్రభుత్వ ఉద్యోగులు

Kalki: OTTలో సరికొత్త చరిత్రను సృష్టించిన కల్కి.. వరల్డ్ వైడ్‌ నెం.1

15 ఏళ్ల కుర్రాడి వల్గర్ కామెంట్.. ఏడుపు ముఖం పెట్టిన హీరోయిన్

కిడ్నీలు డ్యామేజ్‌తో దారుణంగా నటుడి పరిస్థితి.. ప్రొడ్యూసర్ ఆర్థిక సాయం

కంగనాకు షాకిచ్చిన బాంబే కోర్ట్‌ !! ఇక ఎమర్జెన్సీ రిలీజ్‌ కష్టమేనా !!

Follow us