వ‌ర‌ద బాధితుల‌కు రూ.100 కోట్ల విరాళం ప్రకటించిన ప్రభుత్వ ఉద్యోగులు

తెలంగాణలో వరద బాధితులకు ప్రభుత్వ ఉద్యోగులు విరాళం ప్రకటించారు. ఉద్యోగుల తరపున సుమారు రూ.100కోట్ల విరాళాన్ని తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్ష‌న్ క‌మిటీ ఛైర్మ‌న్ వి.ల‌చ్చిరెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వ‌ర్షాల‌తో ఆస్తి, ప్రాణ న‌ష్టం జ‌రిగిందని ల‌చ్చిరెడ్డి పేర్కొన్నారు. ప్ర‌భుత్వం త‌గు స‌హాయ‌క చ‌ర్య‌లను సైతం వేగ‌వంతం చేసింద‌న్నారు. రాష్ట్రంలోని అన్ని విభాగాల‌ ప్ర‌భుత్వ ఉద్యోగుల సైతం స‌హాయ‌క చ‌ర్య‌ల్లో నిమ‌గ్న‌మ‌య్యారని గుర్తు చేశారు.

వ‌ర‌ద బాధితుల‌కు రూ.100 కోట్ల విరాళం ప్రకటించిన ప్రభుత్వ ఉద్యోగులు

|

Updated on: Sep 06, 2024 | 2:06 PM

తెలంగాణలో వరద బాధితులకు ప్రభుత్వ ఉద్యోగులు విరాళం ప్రకటించారు. ఉద్యోగుల తరపున సుమారు రూ.100కోట్ల విరాళాన్ని తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్ష‌న్ క‌మిటీ ఛైర్మ‌న్ వి.ల‌చ్చిరెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వ‌ర్షాల‌తో ఆస్తి, ప్రాణ న‌ష్టం జ‌రిగిందని ల‌చ్చిరెడ్డి పేర్కొన్నారు. ప్ర‌భుత్వం త‌గు స‌హాయ‌క చ‌ర్య‌లను సైతం వేగ‌వంతం చేసింద‌న్నారు. రాష్ట్రంలోని అన్ని విభాగాల‌ ప్ర‌భుత్వ ఉద్యోగుల సైతం స‌హాయ‌క చ‌ర్య‌ల్లో నిమ‌గ్న‌మ‌య్యారని గుర్తు చేశారు. అయిన‌ప్ప‌టికీ విప‌త్తు భారీగానే న‌ష్టాన్ని క‌లిగిచింద‌న్నారు. ఈ ఘ‌ట‌న త‌మ‌ను తీవ్రంగా క‌లిచివేసింద‌న్నారు. కొత్త ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత దీనిని అతిపెద్ద విప‌త్తుగా తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్ష‌న్ క‌మిటీ భావించిందన్నారు. ఇలాంటి స‌మ‌యంలో త‌మ వంతుగా ప్ర‌భుత్వానికి ఆర్ధిక ప‌రంగా చేయూత‌గా రాష్ట్రంలోని ఉద్యోగుల త‌రుపున ఒక రోజు వేత‌నం సుమారు రూ.100 కోట్ల‌ను ప్రభుత్వానికి ఇచ్చేందుకు స్వ‌చ్ఛందంగా నిర్ణ‌యం తీసుకున్నామన్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Kalki: OTTలో సరికొత్త చరిత్రను సృష్టించిన కల్కి.. వరల్డ్ వైడ్‌ నెం.1

15 ఏళ్ల కుర్రాడి వల్గర్ కామెంట్.. ఏడుపు ముఖం పెట్టిన హీరోయిన్

కిడ్నీలు డ్యామేజ్‌తో దారుణంగా నటుడి పరిస్థితి.. ప్రొడ్యూసర్ ఆర్థిక సాయం

కంగనాకు షాకిచ్చిన బాంబే కోర్ట్‌ !! ఇక ఎమర్జెన్సీ రిలీజ్‌ కష్టమేనా !!

Follow us