15 ఏళ్ల కుర్రాడి వల్గర్ కామెంట్.. ఏడుపు ముఖం పెట్టిన హీరోయిన్

బాలీవుడ్ ప్రముఖ నటి ఉర్ఫీ జావేద్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. విభిన్నమైన డ్రెస్సులు వేస్తూ బోల్డ్ పర్సనాలిటీగా పేరు తెచ్చుకుందీ అందాల తార. అయితే ఒక్కోసారి ఈ అమ్మడి యవ్వారం హద్దులు దాటుతుంటుంది. అందుకే చాలా మంది ఉర్ఫీని ట్రోల్ చేస్తుంటారు. అయితే ఈ సొగసరి తీరు మాత్రం మారదు. అదే సమయంలో తనను తక్కువ చేసి మాట్లాడితే ఏ మాత్రం సహించదు. వెంటనే కౌంటర్లు ఇస్తుంది.

15 ఏళ్ల కుర్రాడి వల్గర్ కామెంట్.. ఏడుపు ముఖం పెట్టిన హీరోయిన్

|

Updated on: Sep 06, 2024 | 12:08 PM

బాలీవుడ్ ప్రముఖ నటి ఉర్ఫీ జావేద్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. విభిన్నమైన డ్రెస్సులు వేస్తూ బోల్డ్ పర్సనాలిటీగా పేరు తెచ్చుకుందీ అందాల తార. అయితే ఒక్కోసారి ఈ అమ్మడి యవ్వారం హద్దులు దాటుతుంటుంది. అందుకే చాలా మంది ఉర్ఫీని ట్రోల్ చేస్తుంటారు. అయితే ఈ సొగసరి తీరు మాత్రం మారదు. అదే సమయంలో తనను తక్కువ చేసి మాట్లాడితే ఏ మాత్రం సహించదు. వెంటనే కౌంటర్లు ఇస్తుంది. తాజాగా ఉర్ఫీ జావేద్ కు చేదు అనుభవం ఎదురైంది. తల్లిదండ్రులు, అభిమానుల ముందే ఆమెకు ఓ అసభ్యకరమైన ప్రశ్న వేశాడు ఓ 15 ఏళ్ల కుర్రాడు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసుకుని వాపోయింది. రీసెంట్గా తన కుటుంబం ముందు చాలా బాధించే సంఘటన జరిగిందని చెప్పింది ఉర్ఫీ. కెమెరామెన్లు తనను ఫోటోలు తీస్తుండగా ఒక కుర్రాళ్ల గుంపు తన ముందు నుంచి వెళ్లిందని.. అందులో ఒక కుర్రాడు దారుణ కామెంట్ చేశాడని చెప్పింది. ఆ అబ్బాయికి దాదాపు 15 ఏళ్లు కూడా లేవని.. తన కుటుంబం, తల్లి ముందు అలా అడగడంతో తాను షాక్ అయ్యా అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఆ అబ్బాయి తల్లిదండ్రుల పట్ల జాలిపడుతున్నానంటూ చెప్పింది. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. బీటౌన్లో బజ్ చేస్తున్నాయి.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కిడ్నీలు డ్యామేజ్‌తో దారుణంగా నటుడి పరిస్థితి.. ప్రొడ్యూసర్ ఆర్థిక సాయం

కంగనాకు షాకిచ్చిన బాంబే కోర్ట్‌ !! ఇక ఎమర్జెన్సీ రిలీజ్‌ కష్టమేనా !!

The Goat: విజయ్ ది గోట్ మూవీ హిట్టా ?? ఫట్టా ??

అమ్మాయిలూ ‘స్పై కెమెరా’లను ఎలా కనిపెట్టాలో తెలుసా ??

Follow us