“క‌రోనాపై ప్ర‌జ‌ల పోరాటం స్ఫూర్తినిస్తోంది”

క‌రోనాపై ప్ర‌జ‌ల పోరాటం స్ఫూర్తినిస్తోంది

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉన్న ప్రముఖ నటులలో అమితాబ్ బచ్చన్ ఒకరు. బిగ్ బి..  పోస్టుల ద్వారా తన డైలీ అప్డేట్స్ అభిమానుల‌తో పంచుకుంటూ ఉంటారు. సోష‌ల్ మీడియాలో ఎక్కువ‌గా తన తండ్రి హరివంశ్రాయ్ బచ్చన్ రాసిన కవితలను పంచుకుంటారు అమితాబ్. తాజా రాజ‌కీయ‌, సామాజిక అంశాల‌పై కూడా త‌న మార్క్ ఆలోచ‌న‌లు వెల్లిబుచ్చుతారు ఈ సీనియ‌ర్ న‌టుడు. కాగా సోమ‌వారం అమితాబ్..త‌న పాత బ్లాక్ అండ్ వైటో ఫోటోను..రీసెంట్ ఫోటోను క‌లిపి షేరు చేశారు. […]

Ram Naramaneni

|

Apr 14, 2020 | 2:43 PM

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉన్న ప్రముఖ నటులలో అమితాబ్ బచ్చన్ ఒకరు. బిగ్ బి..  పోస్టుల ద్వారా తన డైలీ అప్డేట్స్ అభిమానుల‌తో పంచుకుంటూ ఉంటారు. సోష‌ల్ మీడియాలో ఎక్కువ‌గా తన తండ్రి హరివంశ్రాయ్ బచ్చన్ రాసిన కవితలను పంచుకుంటారు అమితాబ్. తాజా రాజ‌కీయ‌, సామాజిక అంశాల‌పై కూడా త‌న మార్క్ ఆలోచ‌న‌లు వెల్లిబుచ్చుతారు ఈ సీనియ‌ర్ న‌టుడు.

కాగా సోమ‌వారం అమితాబ్..త‌న పాత బ్లాక్ అండ్ వైటో ఫోటోను..రీసెంట్ ఫోటోను క‌లిపి షేరు చేశారు. అయితే, ఇక్క‌డ‌ మా దృష్టిని ఆకర్షించినది పోస్ట్‌తో పాటు పెట్టిన‌ క్యాప్షన్. కరోనావైరస్ సంక్షోభంపై తన ఆలోచనలను పంచుకుంటూ.. ప్ర‌జ‌లు వారి కులం, మతం, నమ్మకం అనే తేడా లేకుండా అందరూ కలిసి క‌రోనాపై పోరాటానికి ముందుకు వ‌చ్చార‌ని చెప్పుకొచ్చారు. “ఇందులో, ఎటువంటి సందేహం లేదు, ఈ మహమ్మారి వెంటాడుతోన్న‌ సమయంలో, .. కుల, వర్ణ, మతం, లేదా నమ్మకంతో సంబంధం లేకుండా .. స్నేహితుడు, పరిచయస్తుడు లేదా తెలియనివాడు అనే బేధం చూప‌కుండా ప్ర‌జ‌లు ఒకరిపై ఒక‌రు శ్ర‌ద్ద చూపించ‌డం నిజంగా గొప్ప‌ సానుభూతి .. ప్రతి పెదవి ఇప్పుడు ఒక్క‌టే ప‌లుకుతుంది .. సురక్షితంగా ఉండండి, రక్షించండి 👏👏” అని అమితాబ్ ట్వీట్ చేశారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu