Allu Arjun: సతీమణి స్నేహాతో కలిసి స్టైలిష్ లుక్లో ఐకాన్ స్టార్.. సముద్రతీరాన అల్లు అర్జున్ న్యూఇయర్ సెలబ్రెషన్స్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి షేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది.
కొత్త ఏడాదికి సరికొత్తగా స్వాగతం పలికింది ప్రపంచం. సామాన్యులు.. సెలబ్రెటీలు ఎంతో ఉత్సాహంగా కుటుంబాలతో తమ విలువైన సమయాన్ని గడుపుతూ… గతేడాది చేదు అనుభవాలను వదులుకుంటూ.. మధురమైన జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ… ఎన్నో ఆశలతో నూతన సంవత్సరానికి వెల్ కమ్ చెప్పారు. న్యూఇయర్ సందర్భంగా ఎన్టీఆర్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, రామ్ చరణ్ తమ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి షేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది.
హ్యాపీ న్యూఇయర్ అంటూ సముద్రతీరాన బన్నీతో కలిసి ఉన్న ఫిక్ ఫాలోవర్లతో పంచుకుంది. అందులో అర్జున్ మరింత స్టైలీష్ లుక్ లో కనిపిస్తున్నారు. వీరిద్దరి ఫోటోకు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. కాగా కొద్ది రోజుల క్రితం ఫ్యామిలీతో కలిసి గోవా వెకేషన్ కు బన్నీ వెళ్లిన సంగతి తెలిసిందే.
పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సంపాదించుకున్న బన్నీ.. ప్రస్తుతం ఈ చిత్రం సీక్వెల్ చేస్తున్నారు. పుష్ప 2 అనే టైటిల్ తో రాబోతున్న ఈ మూవీపై ఇప్పటికే భారీగా అంచనాలున్నాయి. కొద్దిరోజుల క్రితం ప్రారంభమైన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే న్యూఇయర్ సందర్భంగా బన్నీతోపాటు.. డైరెక్టర్ సుకుమార్ సైతం చిత్రీకరణ నుంచి బ్రేక్ తీసుకున్నారు. వీరు తమ ఫ్యామిలీస్ తో కలిసి వెకేషన్స్ ఎంజాయ్ చేస్తున్నారు.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.