Viral: ఓర్నీ.! భక్తితో గుడికొచ్చాడనుకుంటే.. దేవుడికే ఎసరు పెట్టాడు.. ఏం చేశాడో చూస్తే
అందరూ గుడికి ఎందుకొస్తారు.? ఇదేం పిచ్చి ప్రశ్న అని అనుకుంటున్నారా.! దేవుడిని పూజించడానికి, లేదా తమ కోరికలు విన్నవించడానికి.. భక్తులు గుడికి క్యూ కడతారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. అసలు ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా మరి.!
తమ కోరికలు నేరవేర్చమని, లేదా చిన్న చిన్న కానుకలు దేవుడికి సమర్పించుకునేందుకు గుడికి వస్తుంటారు భక్తులు. కానీ ఈ కేటుగాడు కాస్త సెపరేటు.. అందరూ నడిచిన దారిలో నడవడు. గుడికి వచ్చిన ఇతడు.. పట్టుమని పదిహేను నిమిషాలు దేవుడికి మొక్కుకున్నాడు. కట్ చేస్తే.. ఆ తర్వాత ఏం చేశాడో చూస్తే మీరు షాక్ కావడం ఖాయం. వివరాల్లోకి వెళ్తే.. ఆంజనేయస్వామి వెండి కీరటాన్ని దొంగలించిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మిర్జాపూర్ జిల్లాలో చోటు చేసుకుంది. వీడియో ప్రకారం.. ఓ దొంగ భక్తి కొద్దీ గుడిలో కీర్తనలు లాంటివి పాడుతున్నట్టు మీరు చూడవచ్చు. కానీ అదంతా కల్లబొల్లి నాటకమే.. సరైన సమయం చూసి గర్భగుడిలోకి వెళ్లి.. దేవుడి వెండి కీరటాన్ని ఎత్తుకెళ్లాడు దొంగ. ఈ ఘటన సీసీటీవీ కెమెరాలలో రికార్డు కాగా.. క్షణాల్లో ఇంటర్నెట్‌లో వైరల్ అయింది. కాగా, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

