Tejsvi Surya: సింగర్ శివశ్రీని పెళ్లాడబోతున్న బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య.. పెళ్లి ఎప్పుడంటే..?
అత్యంత పిన్నవయస్కులైన ఎంపీలలో ఒకరిగా ఉన్న కర్ణాటక ఎంపీ తేజస్వి సూర్య త్వరలోనే ఒక ఇంటి వారు కాబోతున్నారు. చెన్నైకి చెందిన ప్రముఖ గాయని, భరతనాట్య కళాకారిణి శివశ్రీ స్కంద ప్రసాద్‌ను త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారు. ఈ విషయాన్ని తేజస్వి సూర్య మంగళవారం బెంగళూరులో స్వయంగా ప్రకటించారు.
భారతీయ జనతా పార్టీ ఎంపీ తేజస్వి సూర్య ఓ ఇంటివారు కాబోతున్నారు.. దేశంలోనే అత్యంత పిన్న వయస్సు ఎంపీలలో ఒకరిగా గుర్తింపు పొందిన తేజస్వి సూర్య.. బెంగళూరు దక్షిణ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బెంగళూరు సౌత్ నుంచి రెండోసారి గెలిచిన తేజస్వి సూర్య.. చెన్నైకు చెందిన ప్రముఖ గాయని, శాస్త్రీయ సంగీతం, భరతనాట్య కళాకారిణి అయిన శివశ్రీ స్కంద ప్రసాద్‌ను వివాహం చేసుకోనున్నారు. ఈ విషయాన్ని తేజస్వి సూర్య మంగళవారం బెంగళూరులో స్వయంగా ప్రకటించారు. మార్చి 24న వివాహ ముహూర్తం నిర్ణయించినట్లు తెలిపారు.
వివరాల ప్రకారం.. గాయని శివశ్రీ.. శాస్త్ర యూనివర్సిటీ నుంచి బయో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. మద్రాస్ యూనివర్సిటీ నుంచి భరతనాట్యంలో ఎంఏ, మద్రాస్ సంస్కృత కాలేజీలో సంస్కృతంలో ఎంఏ పట్టా పుచ్చుకున్నారు. పొన్నియిన్ సెల్వన్ పార్ట్ -2లో కన్నడ వర్షన్‌లో శివశ్రీ ఓ పాట కూడా పాడారు.. ఆమె యూట్యూబ్ ఛానెల్‌కు 2 లక్షల మంది సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు.
కాగా.. 34 ఏళ్ల తేజస్వి సూర్య.. వృత్తి రీత్యా లాయర్.. కానీ ప్రస్తుతం ఆయన బెంగళూరు సౌత్ లోక్ సభ స్థానం నుంచి పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019, 2024 ఎంపీ ఎన్నికల్లో గెలుపొందారు. అయితే.. 2020 నుంచి భారతీయ జనతా యువ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా తేజస్వి సూర్య కొనసాగుతున్నారు. అంతేకాకుండా.. ‘ఐరన్‌మ్యాన్ 70.3 ఎండ్యురన్స్ రేస్’ పూర్తి చేసిన ఎంపీగా గతేడాది రికార్డు సృష్టించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..