అలా చేస్తే  నిజంగానే అమ్మ చేతిలో దెబ్బలు పడతాయ్: శ్రీలీల

03  January 2025

Basha Shek

అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2' కిస్సిక్ సాంగ్ తో తిరిగి ట్రెండింగ్‌లోకి వచ్చేసింది డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల.

దీనికి ముందు ఈ అందాల తార నటించిన పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్స్ గా నిలిచాయి.

మహేశ్ బాబు గుంటూరు కారం, రామ్ స్కంద, నితిన్ ఎక్స్ ట్రార్డినరి, వైష్ణవ్ ఆది కేశవ సినిమాలు ఫ్లాపులుగా మిగిలిపోయాయి.

దీంతో కొద్ది రోజుల గ్యాప్ తీసుకున్న శ్రీలీల పుష్ప 2 కిస్సిక్ సాంగ్ తో తిరిగి మళ్లీ ట్రెండిగ్ లోకి వచ్చేసింది.

కిస్సిక్ పాట  సూపర్ హిట్ కావడంతో  దేశవ్యాప్తంగా శ్రీలల క్రేజ్ అమాంతం పెరిగిపోయింది

ఆమె ఎక్కడ కనిపించినా అభిమానులు, మీడియా రిపోర్టర్లు తమ కెమెరాలను 'కిస్సిక్'మనిపిస్తునారు

తాజాగా శ్రీలీల తన తల్లితో ఎయిర్ పోర్టులో కనిపించగానే  'పుష్ప 2' భాషలో కిస్సిక్ ప్లీజ్ అని అడిగారు కొందరు.

దీనికి బదులుగా శ్రీలీల 'పుష్ప 2' కిస్సిక్ స్టైల్ లోనే డ్యాన్స్ చేస్తే అమ్మ దెబ్బలు కొడుతుందని నవ్వుతూ చెప్పింది.