School Holidays: పెరుగుతున్న చలి తీవ్రత.. జనవరి 3 నుంచి 8వ తరగతి వరకు పాఠశాలలు బంద్‌!

School Holidays: చలి తీవ్రత పెరిగిపోతోంది. ఈ చలి వృద్దులతో పాటు విద్యార్థుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపనుందని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి చలి తీవ్రత కారణంగా జనవరి 3వ తేదీ నుంచి చిన్నారుల నుంచి 8వ తరగతి వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పాఠశాలలను ఓపెన్‌ చేయవద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు..

School Holidays: పెరుగుతున్న చలి తీవ్రత.. జనవరి 3 నుంచి 8వ తరగతి వరకు పాఠశాలలు బంద్‌!
Follow us
Subhash Goud

|

Updated on: Jan 03, 2025 | 7:32 PM

కొనసాగుతున్న చలి తీవ్రత, పొగమంచు పరిస్థితుల మధ్య, నోయిడాలోని నర్సరీ నుండి 8వ తరగతి వరకు ఉన్న పాఠశాలలు రేపటి నుండి అంటే జనవరి 3 నుండి పాఠశాలలు మూసి వేయనున్నారు. అక్కడి ప్రభుత్వం. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు మూసి ఉంచాలని ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని గౌతమ్ బుద్ధ నగర్ జిల్లా మేజిస్ట్రేట్ మనీష్ కుమార్ వర్మ ఈ ప్రకటన చేశారు. ఈ ఉత్తర్వు యుపీ బోర్డ్, సిబిఎస్‌ఇ, అన్ని ఇతర బోర్డుల పాఠశాలలకు వర్తిస్తుందని పేర్కొన్నారు. ఉత్తర్వులను ఉల్లంఘించిన పాఠశాలలపై ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు.

శీతాకాలపు చలి, పొగమంచుతో కూడిన వాతావరణం ప్రధాన ప్రాంతాలను చుట్టుముట్టడం వల్ల పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు అసౌకర్యం కలుగుతుందని జిల్లా ప్రాథమిక విద్యాధికారి రాహుల్ పన్వార్ ప్రధానోపాధ్యాయులకు రాసిన లేఖలో తెలిపారు. జిల్లా మేజిస్ట్రేట్ మనీష్ కుమార్ వర్మ ఆదేశాల మేరకు బోర్డు గుర్తింపు పొందిన పాఠశాలలన్నీ తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు మూసివేయాలని ఆదేశించినట్లు పన్వార్ తెలిపారు. ఇదిలా ఉండగా, పాట్నాలో, చలి పరిస్థితుల దృష్ట్యా జనవరి 6 వరకు అన్ని పాఠశాలల సమయాన్ని జిల్లా యంత్రాంగం మార్చింది.

భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం.. దట్టమైన పొగమంచు, చలి వాతావరణం వచ్చే 24 గంటల్లో వాయువ్య, మధ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో కొనసాగవచ్చు. చలికాలంలో దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆగ్రాలో దట్టమైన పొగమంచు నగరాన్ని చుట్టుముట్టింది. పెరిగిన పొగమంచు కారణంగా ఐకానిక్ స్మారక చిహ్నమైన తాజ్ మహల్ పొగమంచుతో కప్పబడి ఉండటం వలన కనిపించని పరిస్థితి నెలకొంది.

ఇవి కూడా చదవండి

అనేక ప్రాంతాలతో పాటు దేశ రాజధాని ఉష్ణోగ్రతలలో గణనీయమైన తగ్గుదలని కనిపిస్తోంది. సాయంత్రం, రాత్రి సమయంలో పొగమంచు ఉంటుంది. రాబోయే ఐదు రోజుల్లో వాయువ్య భారతదేశంలో కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా 2-3 డిగ్రీల మేర పెరిగే అవకాశం ఉంది. అయితే, రాబోయే 3 రోజులలో మధ్య, తూర్పు భారతదేశంలో కనిష్ట ఉష్ణోగ్రతలలో గణనీయమైన మార్పు ఉండదు. ఆ తర్వాత క్రమంగా 2-3 ℃ పెరుగుతుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి