Team India: హిట్‌మ్యాన్‌తో ఆ నలుగురు.. ఇక క్రికెట్‌కు గుడ్‌బై.! లిస్టులో కోహ్లీ స్నేహితుడు

2024లో కొన్ని నష్టాలు, మరికొన్ని లాభాలు మన అంతర్జాతీయ క్రికెట్‌లో చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా టీమిండియాలో కొంతమంది సీనియర్ ప్లేయర్స్ రిటైర్ కాగా.. ఇప్పుడు మళ్లీ కొత్త సంవత్సరంలోనూ ఇంకొందరు ఆటగాళ్లు రిటైర్మెంట్ ప్రకటించారు. మరి ఆ వివరాలు ఎలా ఉన్నాయంటే..

Team India: హిట్‌మ్యాన్‌తో ఆ నలుగురు.. ఇక క్రికెట్‌కు గుడ్‌బై.! లిస్టులో కోహ్లీ స్నేహితుడు
Team India
Follow us
Ravi Kiran

|

Updated on: Jan 01, 2025 | 10:43 AM

ఎంతోమంది ప్రముఖ క్రికెటర్లు గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఈ లిస్టులో డేవిడ్ వార్నర్, శిఖర్ ధావన్, జేమ్స్ అండర్సన్, రవిచంద్రన్ అశ్విన్ లాంటి దిగ్గజాలు ఉన్నారు. అటు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికారు. న్యూఇయర్ వచ్చేసింది. ఈ కొత్త సంవత్సరంలోనూ టీమిండియాలోని పేరొందిన క్రికెటర్లు కొందరు రిటైర్మెంట్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. మరి వాళ్లెవరో ఇప్పుడు తెలుసుకుందామా..

రోహిత్ శర్మ

2024లో టెస్టు క్రికెట్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రదర్శన పేలవంగా ఉంది. బ్యాట్‌తోనే కాదు.. కెప్టెన్సీలోనూ పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు. తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం.. జనవరి 3 నుంచి 7 మధ్య జరిగే సిడ్నీ టెస్ట్ రోహిత్ శర్మ కెరీర్‌లో చివరి మ్యాచ్. ఒకవేళ అందులో భారత్ ఓడిపోతే రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది. రోహిత్ 67 టెస్టుల్లో 4301 పరుగులు చేశాడు. అతని పేరిట 12 సెంచరీలు నమోదయ్యాయి.

రవీంద్ర జడేజా

ఈ జాబితాలో భారత స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా పేరు కూడా ఉంది. 36 ఏళ్ల జడేజా గతేడాది టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత టీ20 ఇంటర్నేషనల్స్ నుంచి రిటైరయ్యాడు. ఇప్పుడు అతడు 2025లో క్రికెట్‌లో అతిపెద్ద ఫార్మాట్ అయిన టెస్ట్‌‌లకు వీడ్కోలు పలికే ఛాన్స్ ఉంది. 2024లో జడేజా టెస్టుల్లో పేలవమైన ఆటతీరు ప్రదర్శించాడు. ఇప్పటివరకు 79 టెస్టులాడి 3331 పరుగులు చేయడంతో పాటు 323 వికెట్లు తీశాడు.

చతేశ్వర్ పుజారా

ఛతేశ్వర్ పుజారా చివరిసారిగా 2014లో లాస్ట్ వన్డే. అతడు 2011 నుండి 2023 వరకు భారత్ తరపున టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. 36 ఏళ్ల పుజారా 2023లో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో తన చివరి టెస్టు ఆడాడు. అప్పటి నుంచి అతడు టీమ్ ఇండియాకు దూరమయ్యాడు. భారత్ తరఫున 103 టెస్టులాడి 7195 పరుగులు చేసిన పుజారా కొత్త సంవత్సరంలో క్రికెట్ నుంచి రిటైర్ అయ్యే అవకాశం ఉంది.

అజింక్య రహానే

36 ఏళ్ల అజింక్య రహానే ఇటీవల దేశవాళీ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అద్భుతమైన ఫామ్‌లో కనిపించాడు. అయితే అతడు చాలాకాలంగా టీమ్ ఇండియాకు దూరంగా ఉన్నాడు. జూలై 2023లో వెస్టిండీస్‌తో తన చివరి టెస్టు ఆడాడు. అప్పటి నుంచి టెస్టు జట్టుకు దూరమయ్యాడు. అజింక్య రహానే కూడా 2025లో తన అంతర్జాతీయ క్రికెట్‌పై పెద్ద నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. రహానే 85 టెస్టుల్లో 5 వేలకు పైగా పరుగులు చేశాడు.

ఇషాంత్ శర్మ

భారత్ తరఫున 430కి పైగా అంతర్జాతీయ వికెట్లు తీసిన ఇషాంత్ శర్మ తన చివరి మ్యాచ్ 2023లో కాన్పూర్‌లో న్యూజిలాండ్‌తో ఆడాడు. అప్పటి నుంచి 36 ఏళ్ల ఇషాంత్ భారత జట్టుకు దూరంగా ఉన్నాడు. 2024 ముగిసింది. ఇక ఇప్పుడు కొత్త సంవత్సరంలో ఇషాంత్ తన కెరీర్‌కి ముగింపు పలికే ఛాన్స్ ఉంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?
కొత్త ఏడాది సరికొత్తగా రానున్న.. ది ఇయర్ ఆఫ్ క్రేజీ సీక్వెల్స్
కొత్త ఏడాది సరికొత్తగా రానున్న.. ది ఇయర్ ఆఫ్ క్రేజీ సీక్వెల్స్
ఇన్‌ఫ్ల్యూయెంజాA, HMPV వైరస్‌లతో ఇబ్బందిపడుతున్న చైనా
ఇన్‌ఫ్ల్యూయెంజాA, HMPV వైరస్‌లతో ఇబ్బందిపడుతున్న చైనా