AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: మూడో పెళ్లి సైతం ముక్కలయ్యింది.. 8 ఏళ్లుగా పోరాటం.. చివరకు విడాకులు తీసుకున్న హీరోయిన్..

2024 నేటితో ముగుస్తుంది. మరికొన్ని గంటల్లో కొత్త సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ ఏడాది ఎంతోమంది స్టార్ కపుల్స్ పర్సనల్ లైఫ్ లో పెను తుఫానులు వచ్చాయి. వైవాహికి బంధానికి ముగింపు పలుకుతూ చాలా మంది సెలబ్రెటీస్ విడాకులు తీసుకున్నారు. తాజాగా ఓ హీరోయిన్ విడాకుల కోసం ఏకంగా 8 ఏళ్లు పోరాడింది.

Tollywood: మూడో పెళ్లి సైతం ముక్కలయ్యింది.. 8 ఏళ్లుగా పోరాటం.. చివరకు విడాకులు తీసుకున్న హీరోయిన్..
Actress New
Rajitha Chanti
|

Updated on: Dec 31, 2024 | 8:56 PM

Share

తన భర్తతో విడాకులు మంజూరు చేయాలంటూ దాదాపు 8 ఏళ్లుగా పోరాడింది ఓ హీరోయిన్. చివరకు ఈ ఏడాది ఆఖరు రోజున డివోర్స్ తీసుకుని తన వైవాహిక బంధానికి స్వస్తి పలికింది. ఆ హీరోయిన్ మరెవరో కాదు.. హాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఏంజెలీనా జోలీ. ఆమె భర్త బ్రాడ్ పిట్ తో ఇప్పుడు అధికారికంగా విడిపోయింది. వీరికి ఆరుగురు పిల్లలు ఉన్నారు. ఏంజెలీనా, బ్రాడ్ 2014 లో వివాహం చేసుకున్నారు. ఇది హాలీవుడ్ చరిత్రలో అత్యంత చర్చనీయాంశమైన వివాహాలలో వీరిద్దరి పెళ్లి సైతం ఒకటి. ఈ ఏడాది విడాకుల తీసుకున్న సెలబ్రెటీ జంటలలో ఏంజెలీనా జోలీ, బ్రాడ్ పిట్ జంట సైతం చేరింది. కానీ హాలీవుడ్ ఇండస్ట్రీలో వీరిని పవర్ కపుల్ అంటారు.

2014లో పెళ్లి చేసుకున్న ఏంజెలీనా జోలీ, బ్రాడ్ పిట్ ఇద్దరూ వివాహమైన రెండేళ్లకే విడిపోవాలనుకున్నారు. కానీ వారి విడాకుల ప్రక్రియ 8 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు అధికారికంగా విడిపోయారు. ఈ విషయాన్ని ఏంజెలీనా లాయర్ కూడా ధృవీకరించారు. న్యాయవాది జేమ్స్ సైమన్ మాట్లాడుతూ.. “8 సంవత్సరాల క్రితం ఏంజెలీనా జోలీ బ్రాడ్ పిట్ నుండి విడాకుల కోసం దాఖలు చేసింది. అప్పటి నుండి ప్రారంభమైన సుదీర్ఘ ప్రక్రియలో ఇది భాగం. ఏంజెలీనా ఎంతో విసిగిపోయింది. ఎట్టకేలకు విడాకులు మంజూరు కావడంతో ఆమె కాస్త ఊరట చెందారు. ఇందులో జ్యూరీ హియరింగ్‌ను అభ్యర్థించారు. అగ్రిమెంట్ విషయంలో ఎలాంటి కన్ఫ్యూజన్ ఉన్నా.. ఈ హియరింగ్‌లో క్లియర్‌ అవుతుందని.. ఇద్దరూ విడాకులు తీసుకుంటున్నారని చెప్పారు.” అని అన్నారు.

ఏంజెలీనా విడాకుల చర్చ..

2016లో ఏంజెలీనా జోలీ తన భర్త బ్రాడ్ పిట్ పై తీవ్ర ఆరోపణలు చేసింది. తనపై, తన కొడుకుపై బ్రాడ్ పిట్ వేధింపులకు పాల్పడినట్లు ఫిర్యాదు చేసింది. బ్రాడ్ పిట్ తన పిల్లల్లో ఒకరిని గొంతు కోసి చంపాడని, మరో కొడుకు ముఖంపై కొట్టాడని ఆమె తీవ్ర ఆరోపణలు చేసింది. ఇప్పుడు ఏంజెలీనా తన పిల్లలతో విడివిడిగా జీవిస్తుంది. 8 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ విడాకుల న్యాయ పోరాటానికి ఇప్పుడు తెరపడింది.

ఏంజెలీనా జోలీ విషయానికొస్తే 49 ఏళ్ల వయసులో మూడో పెళ్లి చేసుకుంది. ఆమె మొదట 1996లో జానీ లీ మిల్లర్‌ను వివాహం చేసుకుంది. నాలుగేళ్లకే విడాకులు తీసుకుంది. ఆ తర్వాత బిల్లీ బాబ్ థోర్టన్‌ను రెండవ వివాహం చేసుకుంది. వారి వివాహం కేవలం 3 సంవత్సరాలు మాత్రమే కొనసాగింది. చివరకు 2014 లో బ్రాడ్ పిట్‌ మూడో పెళ్లి చేసుకుంది.

Angelina Jolie, Brad Pitt

Angelina Jolie, Brad Pitt

ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..

Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?

Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.