Allu Arjun: జిమ్‏లో అల్లు అర్జున్ వర్కవుట్స్.. పుష్ప 2 కోసం తెగ కష్టపడుతోన్న బన్నీ..

పుష్ప సినిమాలో బన్నీ తన లుక్ కోసం ప్రత్యేక డైట్ ఫాలో అవుతున్నారు. షూటింగ్ ఉన్నా.. లేకపోయినా ఫిట్ నెస్ పట్ల ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు. కాస్త ఖాళీ సమయం దొరికితే చాలు ఫ్యామిలీతో గడుపుతూనే.. మరోవైపు జిమ్ లో వర్కవుట్స్ చేస్తున్నారు. తాజాగా ఆయన జిమ్ లో కష్డపడుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది.

Allu Arjun: జిమ్‏లో అల్లు అర్జున్ వర్కవుట్స్.. పుష్ప 2 కోసం తెగ కష్టపడుతోన్న బన్నీ..
Allu Arjun
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 19, 2023 | 7:55 AM

పుష్ప సినిమాతో స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. దేశవ్యాప్తంగా బన్నీ సినిమాల కోసం ఎదురుచూసే అబిమానుల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ మూవీలో బన్నీ ఊరమాస్ లుక్‍లో అదరగొట్టేశారు. ఈ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ఫాలోయింగ్ సంపాదించుకున్న అర్జున్.. ప్రస్తుతం పుష్ప 2 సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారు. కొద్ది నెలలుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే ఈ సినిమాలో బన్నీ తన లుక్ కోసం ప్రత్యేక డైట్ ఫాలో అవుతున్నారు. షూటింగ్ ఉన్నా.. లేకపోయినా ఫిట్ నెస్ పట్ల ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు. కాస్త ఖాళీ సమయం దొరికితే చాలు ఫ్యామిలీతో గడుపుతూనే.. మరోవైపు జిమ్ లో వర్కవుట్స్ చేస్తున్నారు. తాజాగా ఆయన జిమ్ లో కష్డపడుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది.

ఇక ఇప్పుడు నెట్టింట వైరలవుతున్న వీడియోలో జిమ్ లో చెమటలు చిందిస్తూ వర్కవుట్స్ చేస్తున్నారు బన్నీ. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తుండగా.. ఫహద్ ఫాజిల్, అనసూయ, సునీల్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఇటీవల బన్నీ బర్త్ డే సందర్భంగా విడుదలైన టీజర్ మరింత హైప్ క్రియేట్ చేసింది. ఇప్పటికీ నెట్టింట టీజర్ మంచి రెస్పాన్స్‏తో దూసుకుపోతుంది.

ఇవి కూడా చదవండి

ఈ సినిమా తర్వాత బన్నీ.. డైరెక్టర్ సందీప్ వంగా దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేయనున్నారు. ఇప్పటికే వీరిద్దరి సినిమాపై అధికారిక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ సందీప్ ప్రస్తుతం యానిమల్ సినిమా చేస్తున్నారు. ఇందులో రష్మిక, రణబీర్ కపూర్ జంటగా నటిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.