Virupaksha Movie: ‘విరూపాక్ష’ మేకింగ్ వీడియో రిలీజ్.. సాయి ధరమ్ తేజ్ మూవీ ఎలా తీశారో తెలుసా ?..
ఇప్పటివరకు తేజ్ కెరియర్ లో రాని.. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తోన్న మూవీ కావడంతో మరింత బజ్ క్రియేట్ చేస్తుంది. అన్ని కార్యక్రమాలు పూర్తైన ఈ సినిమా ఏప్రిల్ 21న ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో కొద్ది రోజులుగా ఈ మూవీ ప్రమోషన్స్ వేగంగా జరుగుతున్నాయి.

సూప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ చాలా గ్యాప్ తర్వాత విరూపాక్ష సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. హర్రర్ థ్రిల్లర్ జోనర్ లో వస్తోన్న ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే క్యూరియాసిటీని పెంచేసింది. ఇందులో తేజ్ సరసన సంయుక్త మీనన్ కథానాయకగా నటిస్తుండగా.. కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటివరకు తేజ్ కెరియర్ లో రాని.. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తోన్న మూవీ కావడంతో మరింత బజ్ క్రియేట్ చేస్తుంది. అన్ని కార్యక్రమాలు పూర్తైన ఈ సినిమా ఏప్రిల్ 21న ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో కొద్ది రోజులుగా ఈ మూవీ ప్రమోషన్స్ వేగంగా జరుగుతున్నాయి. తెలుగుతోపాటు.. తమిళంలోనూ రిలీజ్ కాబోతున్న సందర్భంగా.. ప్రచార కార్యక్రమాలు జోరందుకున్నాయి.
తాజాగా ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా.. విరూపాక్ష మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. హర్రర్ థ్రిల్లర్ నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీపై ప్రేక్షకులలో మరింత ఆసక్తిని క్రియేట్ చేసింది ఈ మేకింగ్ వీడియో. ఇప్పటికే ఈ మూవీ థీయేట్రికల్ బిజినెస్ పూర్తైంది. ప్రపంచవ్యాప్తంగా 25 కోట్ల వరకు ఈ మూవీ బిజినెస్ జరిగినట్లుగా తెలుస్తోంది. నైజాంలో 7.20 కోట్లకు మూవీ రిలీజ్ రైట్స్ సొంతం చేసుకున్నారు. విశాఖపట్నం 2.25 కోట్లు.. ఈస్ట్ గోదావరి 1.45 కోట్లు.. వెస్ట్ గోదావరి 1.25 కోట్లు.. కృష్ణ 1.45 కోట్లు.. గుంటూరు 1.65 నెల్లూరు 70 లక్షలు సిడెడ్ 3.85 కోట్లు మేరకు బిజినెస్ జరిగినట్లుగా తెలుస్తోంది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్, సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి. చాలా గ్యాప్ తర్వాత డిఫరెంట్ కథాంశంతో రాబోతున్న ఈ మూవీ కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తేజ్ చివరిసారిగా రిపబ్లిక్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఇప్పుడు విరూపాక్ష సినిమాతో థియేటర్లలో సందడి చేయబోతున్నారు.




మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




