Allu Arjun: పాన్ ఇండియా సినిమాలపై కన్నేసిన ఐకాన్ స్టార్.. రెండు ప్రాజెక్ట్స్ ను పట్టాలెక్కించనున్న బన్నీ…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. పుష్ప అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. పుష్ప అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో అల్లుఅర్జున్ లారీ డ్రైవర్ గా నటిస్తున్నాడు. గంధపు చక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరక్కేకుతుంది. ఈ సినిమాలో బన్నీ ఊరమాస్ గెటప్ లో కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఇటీవల బన్నీ కరోనా బారిన పడటంతో షూటింగ్ ఆగిపోయింది. ఈ సినిమా తెలుగు-తమిళం-మలయాళం- హిందీలో రిలీజ్ కానుంది.
ఈ సినిమాతర్వాత బన్నీ వరుసగా పాన్ ఇండియా ప్రాజక్ట్స్ పట్టాలెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడు బన్నీ. పుష్ప సినిమా తర్వాత బన్ని క్యూలో కేజీఎఫ్ ప్రశాంత్ నీల్ తో పాటు ఏ.ఆర్ మురుగదాస్ లాంటి దర్శకులు ఉన్నారని తెలుస్తుంది. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం కేజీఎఫ్ పార్ట్ 2ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా అయిపోయిన తరవాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సలార్ అనే యాక్షన్ ఎంటర్టైనర్ ను తెరకెక్కిస్తున్నాడు. ఈ రెండు సినిమాల్లో కేజీఎఫ్ 2 షూటింగ్ పూర్తి కాగా సలార్ షూటింగ్ దశలో ఉంది. అయితే నిజానికి పుష్ప సినిమా తర్వాత వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ సినిమా చేయాల్సి ఉంది కానీ అనుకోని కారణాల వల్ల ఈ సినిమా ఆగిపోయిందని తెలుస్తుంది. దాంతో మురగదాస్ తో ప్రశాంత్ నీల్ తో సినిమాలను పట్టాలెక్కించాలని చూస్తున్నాడట బన్నీ.
మరిన్ని ఇక్కడ చదవండి :
RGV on PM Modi: మోడీ మృత్యు వ్యాపారి అంటూ నిజం చెప్పిన సోనియా గాంధీ కాళ్ళను మొక్కుతా అంటున్న ఆర్జీవీ